చిరంజీవి సినిమాని రిజెక్ట్ చేసిన కమెడియన్ ఒకరు ఉన్నారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ కమెడియన్ చిరంజీవి చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేశారో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ డైలాగ్స్ మాత్రమే కాదు కామెడీ కూడా ఇరగదీస్తారు. కామెడీ పండించే అతి కొద్దిమంది హీరోల్లో చిరంజీవి ఒకరు. చిరంజీవి పక్కన సరైన కమెడియన్ కాంబినేషన్ కుదిరితే ఆ సీన్లు అద్భుతంగా వస్తాయి. బ్రహ్మానందం, సునీల్, అలీ లాంటి టాప్ కమెడియన్స్ చిరంజీవితో కలసి నటించారు.
25
ఖైదీ నెంబర్ 150 మూవీ
చిరంజీవి సినిమా అంటే నటించడానికి వీరంతా ముందుంటారు. కానీ ఓ స్టార్ కమెడియన్ మాత్రం చిరంజీవి సినిమాని రిజెక్ట్ చేశారు. ఆ కమెడియన్ ఎవరో కాదు.. సునీల్. గతంలో ఠాగూర్, స్టాలిన్, ఇంద్ర లాంటి సినిమాల్లో చిరంజీవితో సునీల్ నటించారు. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ 150 కోసం నటీనటుల ఎంపిక జరుగుతున్న టైంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ విషయాన్ని సునీల్ వివరించారు.
35
చిరంజీవి సినిమాని రిజెక్ట్ చేసిన కమెడియన్
అలీతో సరదాగా కార్యక్రమంలో.. చిరంజీవి గారి సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశావ్ అని అలీ ప్రశ్నించగా సునీల్ బదులిచ్చారు. అది రిజెక్ట్ చేసినట్లు కాదు. నాకు కుదరలేదు అంతే. ఖైదీ నెంబర్ 150 కోసం నన్ను ఎంపిక చేశారు. కానీ అదే టైంలో ఈడు గోల్డ్ ఎహే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాను.
అప్పటికే ఆ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. నేను ఖైదీ నెంబర్ 150 చిత్రానికి డేట్లు ఇస్తే మరోసారి ఈడు గోల్డ్ ఎహే రిలీజ్ వాయిదా పడుతుంది. దీనితో తప్పని పరిస్థితుల్లో ఖైదీ నెంబర్ 150 చిత్రం వదులుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ పాత్ర సేఫ్ హాండ్స్ లోకి వెళ్ళింది. ఆ రోల్ మీరే చేశారు కదా అని సునీల్.. అలీతో అన్నారు.
55
చిరంజీవి ఫోన్ చేసి నన్ను తిట్టకు రా అంటూ..
వెంటనే అలీ రియాక్ట్ అవుతూ.. చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు. అప్పటికి చిరంజీవి గారితో మాట్లాడి చాలా కాలం అవుతోంది. ఆయన సడెన్ గా ఫోన్ చేసేసరికి నమ్మ బుద్ది కాలేదు. ఎవడైనా ఫ్రాంక్ కాల్ చేశాడేమో అని తిట్టడానికి రెడీ అవుతున్నా. ఆయన వెంటనే రేయ్ అలీ నన్నుతిట్టేయకు.. నిజంగానే చిరంజీవిని మాట్లాడుతున్నా అని అన్నారు. ఆ విధంగా సునీల్ చేయాల్సిన రోల్ నాకు వర్కౌట్ అయింది అని అలీ తెలిపారు.