మహేష్ బాబు విషయంలో కృష్ణ నే ఎదిరించాడు, చరిత్రలో నిలిచిపోయే పాట ఇచ్చిన డైరెక్టర్ ఎవరు?

Published : Feb 04, 2026, 02:42 PM IST

మహేష్ బాబు సినిమాలో ఓ పాట కోసం.. ఏకంగా సూపర్ స్టార్ కృష్ణనే ఎదిరించాడు ఓ దర్శకుడు. పట్టుదలతో పంతం నెగ్గించుకుని చరిత్రలో నిలిపోయేలా చేశాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏంటా సాంగ్. 

PREV
15
మహేష్ బాబు కెరీర్ లో ఎత్తు పల్లాలు..

కృష్ణ వారసత్వం తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు.. హీరోగా సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోడానికి చాలా కష్టపడ్డాడు. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ప్లాప్ లు చూశాడు. హీరోగా స్టార్ డమ్ వచ్చి.. మంచి మంచి సినిమాలు చేస్తున్నటైమ్ లో కూడా.. సూపర్ స్టార్ కొన్ని డిజాస్టర్స్ ను చూడాల్సి వచ్చింది. సినిమాలు, కథలు, దర్శకుల విషయంలో మహేష్ బాబు చేసిన కొన్ని పొరపాట్లు ఆయన కెరీర్ కు ఇబ్బందిగా మారాయి. 

ఈక్రమంలో మహేష్ బాబు కెరీర్ ను సరిచేయడానికి కృష్ణ కూడా రంగంలోకి దిగారట. మహేష్ సినిమాల విషయంలో కొన్ని నిర్ణయాలు ఆయనే తీసుకునేవారట. ఈక్రమంలోనే ఓ దర్శకుడు మహేష్ బాబు సినిమా కోసం ఏకంగా కృష్ణనే ఎదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది.

25
ఒక్క పాట కోసం ఎన్నో ఆలోచనలు..

మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలలో మురారి కూడా ఒకటి. ఈసినిమా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కింది. మహేష్ బాబుకు నటుడిగా మంచి పేరు తీసుకువచ్చిన సినిమా ఇది. అప్పటికే కొన్ని ప్లాప్ లు చూసిన మహేష్ కోసం.. కృష్ణవంశీ అద్భుతమైన కథతో... ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈసినిమాను తెరకెక్కించాడు.

 కానీ ఈసినిమా క్లైమాక్స్ సాంగ్ దగ్గర మాత్రం కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. తెలుగు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ.. హీరో మాస్ ఎలివేషన్ అవ్వాలంటే.. క్లైమాక్స్ లో మాస్ సాంగ్ ఉండాలి. అలా అయితేనే సినిమా ఆడుతుందని నమ్మకం.. దాంతో మురారిలో అలనాటి రామచంద్రుడు పాట విషయంలో తేడా వచ్చేసింది. చివరికి ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణ వరకూ వెళ్లింది.

35
కృష్ణ - కృష్ణ వంశీ మధ్య చర్చలు..

మురారి పాట విషయంలో మహేష్ బాబు ఏం తేల్చుకోలేకపోయాడు. ఈసాంగ్ పెడితే సంచలనం అవుతుంది అని కృష్ణవంశీ నమ్మకం.. కాని మహేష్ బాబు ఎదురు చెప్పలేకపోతున్నాడు. దాంతో కృష్ణ దగ్గరకు ఈ విషయం వెళ్లింది. ఆయన కృష్ణ వంశీని పిలిచి..

'' ఏంటబ్బ.. మరి ఈ సాంగ్ పెడితే బాబు ఇమేజ్ కు సరిపోదు కదా.. మాస్ సాంగ్ పెడితేనే ఏమైన బాగుంటుంది. ఇలా కమర్షియల్ హీరోతో ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదు కదా '' అని అన్నారు. వెంటనే కృష్ణవంశి మాట్లాడుతూ.. '' లేదు సార్.. నన్ను నమ్మండి. ఈ సినిమాకు ఆపాటే కరెక్టు.. ఈ సాంగ్ కొన్ని తరాలు నిలిచిపోతుంది... చరిత్ర సృష్టిస్తుంది... మహేష్ కు కూడా పేరు వస్తుంది.'' అని అన్నారు.

45
మీకు నచ్చినట్టు చేసుకోండి...

కృష్ణ వంశీ అంత చెప్పినకప్పటికీ.. సూపర్ స్టార్ కృష్ణ మనసులో మాత్రం ఏదో సందేహం అలాగే ఉంది. అప్పుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ..'' సర్ నేనేమి మాట్లాడనూ.. ఇక్కడ రెండే విషయాలు.. నన్ను నమ్మిఈ సాంగ్ ఉంచండి. లేదంటే మీకు నచ్చిన కమర్షియల్ సాంగ్ ను రికార్డ్ చేయించి.. సినిమాకు యాడ్ చేసి రిలీజ్ చేయండి. కానీ నా పేరు వేయకుండా రిలీజ్ చేసుకోండి. ఈ విషయంలో నా అభ్యంతరం ఏమీ ఉండదు. ఇది కోపంగా చెప్పడంలేదు..మనస్పూర్తిగా చెపుతున్నాను'' అని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. దాంతో కృష్ణ కూడా ఆయన మీద నమ్మకంతో మురారిలో ఆ సాంగ్ పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

55
ప్రతీ పెళ్లిలో.. మురారి సాంగ్ ఉండాల్సిందే...

డైరెక్టర్ కృష్ణ వంశీ నిర్ణయం నిజమయ్యింది. మురారి సినిమా హిట్ అవ్వడంతో పాటు.. ఈ సినిమాలో పెళ్లి పాట ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. దాదాపు 25 ఏళ్లుగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పెళ్లి జరిగినినా.. ఈ సాంగ్ వినిపించాల్సిందే. శుభకార్యాల్లో పక్కాగా ఈ పాట పెట్టాల్సిందే. తెలుగు వారి మనసుల్లో అలా నిలిచిపోయింది సాంగ్.

 మహేష్ బాబు జోడీగా సోనాలీ బింద్రే జోడీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే కదలకుండా కూర్చుని చూసే అభిమానులు ఉన్నారు. ఆరోజు కృష్ణ వంశీ కృష్ణను ఎదిరించి తీసుకున్న నిర్ణయం వల్ల.. మురారి అంత సక్సెస్ అయ్యింది. పాట కూడా చరిత్రలో నిలిచిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories