ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అయిన వెంకటేష్ మూవీ, అన్ని భాషల్లో హిట్, అంతగా ఆ మూవీలో ఏముంది?

విక్టరీ వెంకటేష్ కెరీర్లో అనేక రీమేక్స్ చేశారు. కాగా ఆయన నటించిన ఓ చిత్రం ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? అంత గొప్ప మూవీ ఏంటది? 
 

Daggubati Venkatesh

విక్టరీ ని ఇంటి పేరుగా మార్చుకున్న స్టార్ హీరో వెంకటేష్. కెరీర్ బిగినింగ్ లో స్ట్రగుల్ అయిన వెంకటేష్ మెల్లగా నిలదొక్కుకున్నారు. ప్రేమ, బొబ్బిలిరాజా, చంటి, అబ్బాయిగారు చిత్రాలు వెంకటేష్ కి స్టార్డం తెచ్చాయి. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా వెంకటేష్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించారు. 

Venkatesh Daggubati

అన్ని వర్గాల ప్రేక్షకులు వెంకటేష్ ని ఇష్టపడేవారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ మాత్రమే కాకుండా వెంకటేష్... లవ్ రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా చేశారు. కథ నచ్చితే హీరోయిన్ ప్రాధాన్యత చిత్రాలు కూడా ఆయన చేయడం విశేషం. ఇక మంచి సినిమా ఏ భాషలో తెరకెక్కినా దాన్ని రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించేవారు. 


Daggubati Venkatesh

కెరీర్లో వెంకటేష్ పదుల సంఖ్యలో రీమేక్స్ చేశారు. కాగా ఆయన చేసిన స్ట్రెయిట్ మూవీ ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అయ్యింది. ఆ చిత్రం పవిత్ర బంధం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన పవిత్ర బంధం సూపర్ హిట్. 1996లో పవిత్ర బంధం విడుదలైంది. వెంకటేష్-సౌందర్య జంటగా నటించారు. 

Daggubati Venkatesh

భూపతిరాజా కథ అందించారు. నిజానికి ఓ స్టార్ హీరోకి సెట్ అయ్యే కథ కాదు. హీరోయిన్ సౌందర్య పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆమె చుట్టే కథ నడుస్తుంది. కానీ వెంకటేష్ పవిత్ర బంధం చేయడానికి ఒప్పుకున్నారు. వెంకటేష్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. విదేశాల్లో చదువుకున్న హీరో పాశ్చాత్య సంస్కృతికి అవాటుపడతాడు. 
 

Daggubati Venkatesh

తండ్రి బలవంతంతో తన ఫ్యాక్టరీలో పని చేసే హీరోయిన్ ని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు. కొద్దిరోజులకు ఆమెను వదిలేస్తాడు. హీరోయిన్ మనసు ముక్కలు అవుతుంది. హీరో మనసు మారి హీరోయిన్ కావాలని అనుకున్నపుడు ఆమె బెట్టు చేస్తుంది. ఈ సినిమాకు పోసాని రాసిన బాకుల్లాంటి మాటలు హైలెట్. సౌందర్య నటన కెరీర్ బెస్ట్. 

సౌందర్య ఉత్తమ నటిగా, బాల సుబ్రహ్మణ్యం ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. కీరవాణి సాంగ్స్ సైతం అలరిస్తాయి. అపురూపమైనదమ్మ ఆడ జన్మ..  సాంగ్ చాలా పాప్యులర్. కాగా పవిత్ర బంధం చిత్రాన్ని ఒరియా, కన్నడ, తమిళ్, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్, బెంగాలీ భాషల్లో రీమేక్ చేశారు. తమిళ్ లో ఈ చిత్రాన్ని విజయ్, సిమ్రాన్ జంటగా చేశారు. హిందీలో కాజోల్, అనిల్ కపూర్ నటించారు.  

Latest Videos

click me!