బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో రాజమౌళి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పరిధి పెంచారు. సినిమాలో విషయం ఉంటే భాషా భేదం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తారని నిరూపించాడు. టాలీవుడ్ మార్కెట్ రూ. 100 కోట్లు కూడా లేని సమయంలో రూ. 500-600 కోట్ల బడ్జెట్ తో చిత్రాలు చేయడం అతిపెద్ద సాహసం. బాహుబలి, బాహుబలి 2 చిత్రాల నిర్మాణం కత్తిమీద సామే. అటు ఇటు అయితే వందల కోట్ల నష్టాలు చవి చూడాల్సి వస్తుంది.
తన టాలెంట్ పై నమ్మకంతో రాజమౌళి సాహసం చేశాడు. నిర్మాతలు కూడా ఆయనకు పూర్తి మద్దతు, సహకారం అందించారు. బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. డొమెస్టిక్ గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 రికార్డు అలానే ఉంది. ఇక ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి మరో స్థాయికి వెళ్ళాడు. ప్రపంచ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ సైతం రాజమౌళిని కొనియాడారు.