కానిస్టేబుల్ వల్ల 'లీడర్' కథ పుట్టిందా, సంచలనం విషయం..రాజమౌళికి తన కూతురు కూడా వార్నింగ్ ఇచ్చిందట

First Published Oct 20, 2024, 11:07 AM IST

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు సున్నితమైన భావోద్వేగాలతో ఉంటాయి. ఆనంద్, గోదావరి, ఫిదా లాంటి చిత్రాలు ఆ కోవకి చెందినవే. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో హ్యాపీడేస్ చిత్రాన్ని తెరకెక్కించి ఆకట్టుకున్నారు. కానీ శేఖర్ కమ్ముల తన ఇమేజ్ కి భిన్నంగా తెరకెక్కించిన చిత్రం లీడర్.

Sekhar Kammula

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు సున్నితమైన భావోద్వేగాలతో ఉంటాయి. ఆనంద్, గోదావరి, ఫిదా లాంటి చిత్రాలు ఆ కోవకి చెందినవే. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో హ్యాపీడేస్ చిత్రాన్ని తెరకెక్కించి ఆకట్టుకున్నారు. కానీ శేఖర్ కమ్ముల తన ఇమేజ్ కి భిన్నంగా తెరకెక్కించిన చిత్రం లీడర్. ఈ చిత్రం కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. 

శేఖర్ కమ్ముల టేకింగ్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో శేఖర్ కమ్ముల లేవనెత్తిన అంశాలు, సమాజంలో జరుగుతున్న సంఘటనలు ప్రేక్షకులని ఆలోచింపజేసేలా ఉన్నాయి. రాజకీయాల్లో కొనడం అమ్ముడు పోవడం ఎలా ఉంటుంది అనేది చూపించారు. కామన్ మాన్ కి న్యాయం జరగదు అనే అంశాన్ని బలంగా లేవనెత్తారు. ఈ చిత్రంపై దర్శకధీరుడు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల తో చర్చించారు. రాజమౌళి.. శేఖర్ కమ్ములతో మాట్లాడుతూ.. మీరు సాఫ్ట్ ఎమోషన్స్ ఉండే అద్భుతమైన చిత్రాలు తీశారు. కానీ లీడర్ మూవీలో ఒక కోపం, నిస్సహాయత కనిపించాయి. 

Latest Videos


సమాజం పట్ల, వ్యవస్థ పట్ల ఆ కోపం ఎందుకు ఉంది అని రాజమౌళి ప్రశ్నించారు. శేఖర్ కమ్ముల ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇది ప్రతి ఒక్కరి కోపం.. చదువుకున్న చాలా మంది యువకుల్లో వ్యవస్థపై ఈ కోపం ఉంది. మనదేశం ఒక కార్పొరేటర్ ని జైల్లో పెట్టాలన్నా చాలా ఒత్తిడి ఉంటుంది. శేఖర్ కమ్ముల బదులిస్తూ మన దేశంలో ఒక డబ్బున్న వాడికి, పేద వాడికి న్యాయ పోరాటం జరిగితే.. న్యాయం పేదవాడివైపు ఉన్నప్పటికీ అతడికి న్యాయం జరగదు. ఇప్పుడున్న వ్యవస్థ వల్ల అది అసాధ్యం. ఇది పచ్చి నిజం అని శేఖర్ కమ్ముల అన్నారు. 

ఈ వ్యవస్థ మారాలి అంటే ఒక మంచి లీడర్ అయినా కావాలి లేదా ప్రజలైనా మారాలి అని శేఖర్ కమ్ముల అన్నారు. మన దేశంలో పిల్లలని తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. 10వ తరగతి కుర్రాడికి బీఎండబ్ల్యూ కారు కొనిస్తుంటారు. లంచం ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుంటారు. ముందు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి అని శేఖర్ కమ్ముల అన్నారు. 

నేను అమెరికాకి వెళ్లిన కొత్తలో కారు పార్కింగ్ కోసం ఇబ్బంది పడుతున్నా. కానిస్టేబుల్ ఒక లైట్ ఫ్లాష్ చేస్తుంటాడు. అంటే అక్కడ పార్క్ చేయకూడదు అని అర్థం. అందరూ భయంతో, కానిస్టేబుల్ పై గౌరవంతో కారు అక్కడ పార్క్ చేయరు. ఓవర్ స్పీడ్ వెళ్లినా ఆటోమేటిక్ గా టికెట్ వస్తుంది. రెండు మూడు టికెట్స్ నమోదైతే సింపుల్ గా డ్రైవింగ్ లైసెన్స్ తీసేసుకుంటారు. కానిస్టేబుల్ కి కూడా అక్కడ ప్రజలు అంతలా భయపడతారు. కానీ మనం ఇక్కడ పోలీసులకు భయపడే స్టేజి దాటిపోయాం. ఎలాగోలా మ్యానేజ్ చేసుకోవచ్చులే అనే కాన్ఫిడెన్స్ తో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్నాము అని శేఖర్ కమ్ముల అన్నారు. ఇలాంటి అన్ని అంశాల వల్ల లీడర్ కథ పుట్టినట్లు శేఖర్ కమ్ముల.. రాజమౌళికి చెప్పారు. 

రాజమౌళి మాట్లాడుతూ నేను ఒక సారి ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటే నా కూతురు వార్నింగ్ ఇచ్చింది. నాన్న డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు అని చెప్పినట్లు రాజమౌళి గుర్తు చేసుకున్నారు. అప్పుడు రాజమౌళి కూతురి వయసు 6 ఏళ్ళు అట.  

click me!