హైపర్ ఆది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ బుల్లితెర స్టార్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హాస్య ప్రియులు ఎంతగానో ఇష్టపడతారు. నటుడిగా, బుల్లితెర కమెడియన్ గా లక్షలు సంపాదిస్తున్నాడు. హైపర్ ఆది ఆర్థికంగా స్థిరపడ్డాడు. అయినప్పటికీ హైపర్ ఆదికి వివాహం కాలేదు.
హైపర్ ఆది ప్రస్తుత వయసు 35 ఏళ్ళు దాటిపోయింది. హైపర్ ఆది తోటి కమెడియన్స్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను వంటివారు ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరిద్దరు పిల్లల్ని కన్నారు. మరి హైపర్ ఆది ఎందుకు వివాహం చేసుకోవడం లేదు అనే చర్చ నడుస్తుంది.
ఈ క్రమంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హైపర్ ఆది జాతకంలో దోషం ఉందట. అందుకే వివాహం కావడం లేదట. ఈ దోష నివారణకు ఒకటే మార్గం ఉందట. అయితే హైపర్ ఆది.. అందుకు ఒప్పుకుంటాడా లేదా అనేదే సమస్య.
హైపర్ ఆదికి పెళ్లి కావాలంటే ఆయన ముందు ఓ వృద్ధురాలిని పెళ్లి చేసుకోవాలట. ఫస్ట్ ముసలావిడతో పెళ్లి అయితే... జాతకంలో ఉన్న దోషం పోతుందట. అప్పుడు ఆది నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చట. ఈ విషయాన్ని తాగుబోతు రమేష్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో వేదికగా తెలియజేశాడు.
అయితే ఇదంతా కామెడీలో భాగమే. హైపర్ ఆది కోసం ఇద్దరు వృద్ధ మహిళలను తాగుబోతు రమేష్ అరేంజ్ చేశాడు. అనూహ్యంగా వాళ్లలో ఒక్కరు కూడా ఆదిని వివాహం చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ స్కిట్ పేక్షకుల్లో నవ్వులు పూయించింది.
కాగా హైపర్ ఆది జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాడు. ఢీ డాన్స్ రియాలిటీ షోతో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తున్నాడు. అలాగే సినిమాల్లో కమెడియన్ గా రాణిస్తున్నాడు. జనసేన సీటు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని హైపర్ ఆది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు...