Varshini : ‘నా వయస్సు వారికి పెళ్లై, ప్రెగ్నెన్సీ వచ్చేస్తోంది, నేను మాత్రం’.. తన కోరికను బయటపెట్టిన వర్షిణి

First Published | Feb 25, 2024, 4:20 PM IST

యాంకర్ వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan)  సోషల్ మీడియాలో పోస్ట్ ఆసక్తికరంగా మారింది. తన వయస్సు వారితో పోల్చుకుంటూ షాకింగ్ గా పోస్ట్ పెట్టింది. తన కోరికను ఇన్నాళ్లకు ఇలా బయటపెట్టడం హాట్ టాపిక్ గ్గా మారింది.
 

బుల్లితెర యాంకర్ గా యంగ్ బ్యూటీ వర్షిణి సౌందరరాజన్ కాస్తా మంచి గుర్తింపే దక్కించుకుంది. తన అందం, యాంకరింగ్ స్కిల్స్ తో టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తనదైన శైలిలో ఎంటర్ టైన్ చేసింది. 

పటాస్ 2, కామెడీ స్టార్స్, జబర్దస్త్ వంటి టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి అలరించింది. ఈషోల కోసం వర్షిణి బ్యూటీఫుల్ లుక్స్ లోనూ మెరిసి తన అందంతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. యాంకర్ గా తనవంతుగా కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది.
 



ఇటు బుల్లితెరపై ఆయా షోలతో అలరిస్తూనే మరోవైపు సినిమా ఛాన్స్ లను కూడా దక్కించుకుంటూ వస్తోంది. దాదాపు పదేళ్లుగా ఈ ముద్దుగుమ్మ ఆయా సినిమాల్లో సపోర్టింగ్స్ రోల్స్ చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. కొన్నాళ్లుగా మంచి రోల్స్ ను అందుకుంటోంది. 


అయితే... వర్షిణి కొద్దికాలంగా బుల్లితెరకు దూరమైంది. సినిమాలపైనే ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన అభిమానులకు ఎల్లప్పుడూ టచ్ లోనే ఉంటోంది. 
 

ఈ క్రమంలో తాజాగా వర్షిణి పెట్టి పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. యంగ్ బ్యూటీ మనసులోని మాటలకు అంతా షాక్ అవుతున్నారు. తన తల్లితో ఇంట్లో ఉన్న ఫొటోలను పంచుకుంటూ ఆసక్తికరంగా క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. 

’ఇప్పుడు నా వయస్సు విచిత్రంగా మారింది. కొందరు పెళ్లి చేసుకుంటున్నారు.. కొందరికి ప్రెగ్నెన్నీ కూడా వస్తోంది.. అయినప్పటికీ నేను ఇంకా ఇంట్లో కనీసం బయటికి వెళ్లాలన్నా అనుమతి తీసుకునే పరిస్థితే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇంతకీ ఆమె సమస్య ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోస్ట్ ను నెట్టింట వైరల్ గా మారింది. 
 

Latest Videos

click me!