ఎన్టీఆర్, కృష్ణ లాంటి నటులు అగ్ర హీరోలుగా వెలుగొందారు. వారి తర్వాత చిరంజీవి ఇండస్ట్రీలో నెంబర్ 1 అయ్యారు. కానీ చిరంజీవి ఒక అవకాశాన్ని జారవిడుచుకున్నారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి 40 ఏళ్ళ కెరీర్ లో 150 పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. టాలీవుడ్ లో నంబర్ 1 గా ఎదిగారు. ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళు సైతం ఆశ్చర్యపోయేలా చిరంజీవి సినిమాలు కలెక్షన్స్ రాబట్టేవి. హీరోగా చిరంజీవి ఎంతో సాధించారు. కానీ చిరు ఎప్పుడూ దర్శకత్వం వైపు వెళ్ళలేదు.
25
ఎన్టీఆర్ దర్శకత్వం
లెజెండ్రీ నటుడు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారు హీరోగా నటిస్తూనే ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ తన కెరీర్ లో దానవీర శూర కర్ణ, గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. కృష్ణ కూడా సింహాసనం, అన్నా తమ్ముడు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
35
దమ్మూ ధైర్యం లేక కాదు
కానీ చిరంజీవి ఎప్పుడూ దర్శకత్వం జోలికి వెళ్ళలేదు. దీని గురించి చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దర్శకత్వంని టచ్ చేయకపోవడానికి తనకి దమ్ము ధైర్యం లేక కాదు అని చిరంజీవి అన్నారు. దర్శకత్వం చేసే అవకాశం కూడా వచ్చింది. దర్శకత్వంపై నాకు పట్టు ఉంది. గ్యాంగ్ లీడర్ మూవీ టైం నుంచి నేను సినిమా మేకింగ్ లో ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను.
పరుచూరి బ్రదర్స్ కి ఆ విషయం తెలుసు. దీనితో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నన్నే డైరెక్ట్ చేయమని పరుచూరి బ్రదర్స్ అడిగారు. చేయగలిగే దమ్ము ధైర్యం నాకు ఉన్నాయి. సైరా నరసింహారెడ్డి పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి నటించాలి అంటే దర్శకత్వం లాంటివి ఎక్స్ట్రా వర్క్ పెట్టుకోకూడదు.
55
సైరా నరసింహా రెడ్డి మూవీ
అందుకే దర్శకత్వ బాధ్యతలు తీసుకోలేదు అని చిరంజీవి అన్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరైతే బావుంటుంది అని ఆలోచిస్తున్న టైంలో రాంచరణ్ సురేందర్ రెడ్డి పేరు చెప్పారు. ఆ విధంగా సైరా చిత్రానికి సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎంపిక చేసినట్లు చిరంజీవి పేర్కొన్నారు.