చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో `గ్యాంగ్ లీడర్` సినిమా ఒకటి. ఈ చిత్రంతో పోటీ పడి సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు చిత్తైపోయారు. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే.
చిరంజీవి కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ `గ్యాంగ్ లీడర్`
చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇండస్ట్రీ హిట్స్ అందించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగారు. ఇప్పటికీ తిరుగులేని మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. చిరంజీవిని సూపర్ స్టార్‌ని చేసిన చిత్రాల్లో `గ్యాంగ్ లీడర్` మూవీ స్థానం ప్రత్యేకం. ఇందులో చిరంజీవి నటన, డైలాగ్‌లు, పాటలు, ఫైట్స్, కామెడీ వంటివన్నీ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించాయి. థియేటర్లు ఊగిపోయేలా చేశాయి. చిరు కూడా రెచ్చిపోయి నటించిన చిత్రాల్లో ఇదొకటని చెప్పొచ్చు. మెగాస్టార్ నటన, మ్యానరిజం గురించి చెప్పుకోవాల్సి వస్తే, ముందుగా `గ్యాంగ్ లీడర్` పేరునే చెబుతారు. ఈ మూవీ రిలీజ్ అయి నేటికి 35ఏళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమాతో పోటీ పడి చిత్తైపోయిన సినిమాలేంటో తెలుసుకుందాం.
24
ఇండస్ట్రీ హిట్‌గా `గ్యాంగ్ లీడర్`
చిరంజీవి హీరోగా వచ్చిన `గ్యాంగ్ లీడర్` చిత్రానికి విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. ఇందులో ఆయనకు జోడీగా విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరీ నిర్మించారు. ఈ సినిమా 1991 మే 9న విడుదలైంది. మెగాస్టార్ కెరీర్‌లో ఇదొక ఐకానిక్ రిలీజ్ డేట్‌గా చెప్పొచ్చు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనంగా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటిని బ్రేక్ చేసింది. అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రంగా నిలిచింది. అప్పట్లో ఇది పది కోట్ల వసూళ్లని సాధించడం విశేషం. ఆ తర్వాత ఇదే సినిమాని `ఆజ్ కా గూండా రాజ్` పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది.
34
గ్యాంగ్‌లీడర్‌తో పోటీలో డీలా పడ్డ ఇంద్రభవనం
చిరంజీవి `గ్యాంగ్ లీడర్`తో సూపర్‌స్టార్ కృష్ణ, కృష్ణంరాజు పోటీ పడ్డారు. వీరిద్దరు కలిసి `ఇంద్ర భవనం` అనే చిత్రంలో నటించారు. ఈ మూవీకి కృష్ణ దర్శకుడు కావడం విశేషం. ఆయనే ఎడిటర్ కూడా. మీనా, జ్యోతి వంటి వారు నటించారు. ఇది `స్వాగ్` అనే హిందీ మూవీకి రీమేక్. గ్యాంగ్ లీడర్‌కి సరిగ్గా ఆరు రోజుల ముందు ఈ సినిమా విడుదలయ్యింది. మిశ్రమ స్పందనతో థియేటర్లో ఆడుతున్న ఈ సినిమాని చిత్తు చేసింది చిరు గ్యాంగ్ లీడర్. ఆడియెన్స్ మొత్తం `గ్యాంగ్ లీడర్`కి క్యూ కట్టడంతో సూపర్‌స్టార్, రెబల్ స్టార్ కలిసి నటించిన సినిమాని ఆడియెన్స్ పట్టించుకోలేదు, దీంతో ఇది డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక `గ్యాంగ్ లీడర్` వచ్చిన ఒక్క రోజు గ్యాప్‌తో రాజేంద్రప్రసాద్ నటించిన `ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్` అనే చిత్రం కూడా విడుదలయ్యింది. మే 10న ఈ కామెడీ సినిమా రిలీజ్ అయ్యింది. దీనికి రేలంగి నరసింహారావు దర్శకుడు. రాజేంద్రప్రసాద్‌కి జోడీగా, దివ్యవాణి, పూజిత, అనుష హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మాత్రం ఫర్వాలేదనిపించుకుంది. కామెడీ సినిమా కావడంతో `గ్యాంగ్ లీడర్` ఓవర్ ఫ్లో దీనికి హెల్ప్ అయ్యింది. డీసెంట్‌గా ఆడింది.