Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?

Published : May 09, 2026, 12:20 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ లేడీ డైరెక్టర్ ను తిట్టాడా? ఇంటికి పిలిపించుకుని మరీ క్లాస్ పీకాడా? బన్ని గురించి ఆ దర్శకురాలు చెప్పిన నిజాలేంటి? అసలు ఐకాన్ స్టార్ అలా చేయడానికి కారణం ఏంటి?

PREV
14
టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్ల హవా..

టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు సంఖ్య తక్కువే. కానీ ఎక్కవ సినిమాలు డైరెక్ట్ చేసి.. గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ మాత్రం మన తెలుగువారే. ఆమె మరోవరో కాదు విజయనిర్మల. 46 సినిమాలు డైరెక్ట్ చేసింది. ఆమెతో పాటు భానుమతి, సావిత్రి, జీవిత రాజశేఖర్, జయ, సుధ కొంగర లాంటి వారు ఉన్నారు. వారితో పాటు మరో మహిళాదర్శకురాలు కూడా తనదైన మార్క్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఇంతకీ ఎవరామె? ఆ దర్శకురాలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తిట్లు తిన్నదని మీకు తెలుసా?

24
తక్కువ సినిమాలు, ఎక్కువ పేరు..

ఆ దర్శకురాలు మరెవరో కాదు నందిని రెడ్డి. టాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తన మార్క్ చూపించింది నందిని రెడ్డి. ఇండస్ట్రీ స్టార్స్ లో ఆమెకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాని, సమంత, సిద్దార్ధ్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది నందిని రెడ్డి. ఆమెకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రభాస్, లాంటి స్టార్స్ తో మంచి అనుబంధం ఉంది. సమంతతో క్లోజ్ ఫ్రెండ్షిప్ కూడా ఉంది నందినిరెడ్డికి. అయితే ఓ సందర్భంలో నందిని రెడ్డిని ఇంటికి పిలిచి అల్లు అర్జున్ గట్టిగా క్లాస్ పీకాడట. ఒక సినిమా రిజల్ట్ విషయంలో బన్నీ ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నందిని రెడ్డి స్వయంగా వెల్లడించింది.

34
ఓటమితో డిప్రెషన్ లోకి నందిని రెడ్డి.

నందిని రెడ్డి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసింది. అలా మొదలైంది సినిమాతో స్టార్ట్ అయిన నందిని రెడ్డి ప్రయాణం.. మంచి మంచి కథలతో.. అద్భుతమైన సినిమాలు చేసింది. అయితే ఆమె డైరెక్ట్ చేసిన ఆరు సినిమాల్లో సిద్దార్ద్ హీరోగా నటించిన జబర్దస్త్ మాత్రం డిజాస్టర్ అయ్యింది. 

ఈ సినిమా రిజల్ట్ తో నందినిరెడ్డి బాగా డిస్సపాయింట్ అయ్యింది. ఆ బాధ తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లింది నందిని రెడ్డి మూడు నెలలు బయటకు రాలేదు. విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే నందిని రెడ్డిని ఇంటికి పిలుచుకుని మరీ క్లాస్ పీకాడట. ఈ విషయాన్ని నందిని రెడ్డి స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

44
నందిని రెడ్డికి అల్లు అర్జున్ క్లాస్..

నందిని రెడ్డి బాధలో ఉందని తెలిసి అల్లు అర్జున్ ఇంటికి పిలిచాడు. బన్నీ ఏమన్నాడంటే..'' ఎంటి సినిమా ప్లాప్ అయితే.. ఇక బయటకు రావా.. ? ఒక్క ప్లాప్ తో ఇలా అయిపోవాలా. అక్కడితో ఆగిపోతావా.. ? నెక్ట్స్ సినిమా ప్లాప్ ఏంటి? కథేంటి, లైన్ ఏంటో చెప్పు, నేనున్నా అన్నీ నేను చూసుకుంటా అంటై గట్టిగా క్లాస్ పీకి.. నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. 

మళ్లీ నేను మాములు స్థితికి రావడానికి హెల్ప్ చేశాడు.'' అని నందిని రెడ్డి రీసెంట్ గా ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించింది. నందిని రెడ్డి ఎక్కువగా సమంతతో సినిమాలు చేసింది. ఆమె చేసిన ఆరు సినిమాల్లో మూడు సమంతతో చేసినవే. ప్రస్తుతం ఆమె సమంతతో మా ఇంటి బంగారు సినిమాను డైరెక్ట్ చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories