చెన్నకేశవరెడ్డి సెలబ్రేషన్స్ లో కనిపించని బాలయ్య... బెల్లంకొండతో రక్తపు మరకల చేదు జ్ఞాపకాలే కారణమా!

First Published Sep 26, 2022, 2:26 PM IST

బాలకృష్ణ చిత్రాల్లో చెన్నకేశవరెడ్డి కి ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి బాలయ్యకు మరో హిట్ కట్టబెట్టింది. చెన్నకేశవరెడ్డి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రీరిలీజ్  చేశారు.

సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్ర విజయాలతో బాలకృష్ణ ఫ్యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యాడు. ఆయన ఖద్దరు చొక్కా వేసి కత్తి పడితే బాక్సాఫీస్ బద్దలే అన్నట్లు అప్పట్లో పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో బాలయ్య వరుసగా ఫ్యాక్షన్ చిత్రాలు చేశారు. వాటిలో చెన్నకేశవరెడ్డి ఒకటి. 2002 సెప్టెంబర్ 25న విడుదలైన చెన్నకేశవరెడ్డి 20ఏళ్ళు పూర్తి చేసుకుంది. 
 

Chenna Keshava Reddy

దర్శకుడిగా వి వి వినాయక్ కి ఇది రెండో చిత్రం. ఆది మూవీతో ఆయన పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నారు. ఆది సైతం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రమే. భారీ అంచనాల మధ్య విడుదలైన చెన్నకేశవరెడ్డి మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మెల్లగా పుంజుకొని మంచి విజయాన్ని నమోదు చేసింది. బెల్లకొండ సురేష్ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు.

చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్ కి విశేష స్పందన దక్కింది. ఓవర్సీస్లో అయితే పోకిరి, జల్సా రీ రిలీజ్ రికార్డ్స్ చెన్నకేశవరెడ్డి బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ దక్కింది. కాగా చెన్నకేశవ రెడ్డి రీ రిలీజ్ సెలబ్రేషన్స్ లో దర్శకుడు వివి వినాయక్, నిర్మాత బెల్లంకొండ సురేష్ మాత్రమే పాల్గొంటున్నారు. బాలయ్య ఈ వేడుకలను పట్టించుకున్న దాఖలాలు లేవు. 
 


దీనికి బలమైన కారణముంది. చెన్నకేశవరెడ్డి నిర్మాత బెల్లంకొండ సురేష్ తో ఆయనకు ఎదురైన చేదు అనుభవాల కారణంగానే బాలయ్య చెన్నకేశవరెడ్డి 20 ఇయర్స్ సెలెబ్రేషన్స్ కి దూరంగా ఉంటున్నారనే వాదన ఉంది. బెల్లంకొండ సురేష్ తో పాటు మరొకవ్యక్తిని బాలకృష్ణ తన నివాసంలో షూట్ చేశాడు. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. 
 

2004 లక్ష్మీ నరసింహ విడుదలైంది. ఈ చిత్ర నిర్మాత కూడా బెల్లంకొండ సురేష్. లక్ష్మీ నరసింహ మూవీ ఆర్థిక లావాదేవీల్లో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో సహనం కోల్పోయి బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరిపాడని అప్పట్లో వార్తా కథనాలో వెలువడ్డాయి. ఈ కేసులో బాలయ్యతో పాటు ఆయన భార్య వసుంధర పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. చివరకు బాలయ్య తన మానసిక స్థితి సరిగాలేదని చెప్పి కేసు నుండి బయటపడ్డారు.

ఆ గొడవ జరిగిన తర్వాత బెల్లంకొండ సురేష్ తో బాలయ్య మరలా కలవలేదు. అసలు బెల్లంకొండను తుపాకీతో బాలయ్య కాల్చడానికి అసలు కారణం ఏమిటనేది తెలియదు. మీడియాలో మాత్రం ఆర్థిక లావాదేవీలని రాసుకొచ్చారు. ఆ వివాదం బాలయ్య లైఫ్ టైం బాధపడేలా చేసింది. చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్ సంబరాల్లో బెల్లంకొండ సురేష్ విరివిగా పాల్గొంటున్నారు. ఈ కారణంగా బాలయ్య అసలు దీన్ని పట్టించుకోలేదు. బెల్లంకొండ సురేష్ కి ఎదురుపడితే ఆ నాటి చేదు అనుభవాలు నెమరువేసుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. 
 

అలాగే సమయానికి ఎన్టీఆర్ పేరు మార్పు వివాదం తెరపైకి వచ్చింది. సీఎం జగన్ మెడికల్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టి గతంలో ఉన్న ఎన్టీఆర్ పేరు తొలగించారు. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై పోరాడుతూ బాలయ్య బిజీగా ఉన్నాడు. బాలయ్య తీవ్ర పదజాలంతో ఏపీ సీఎం, మంత్రులను తిట్టిపోశారు. 
 

click me!