దర్శకరత్న దాసరి నారాయణరావు వెండితెరకు పరిచయం చేసిన హీరోయిన్లలో అలనాటి హీరోయిన్ మాధవి (Madhavi) ఒకరు. కమల్ హాసన్ సరసన ‘మరోచరిత్ర’లో నటించిన అచ్చ తెలుగమ్మాయి మాధవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ నటించింది. తెలుగమ్మాయి అయినప్పటికీ భారత - జర్మనీ సంతతికి చెందిన రాల్ఫ్ శర్మ అనే ఫార్మాస్యూటికల్ వ్యాపారిని 1996లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం న్యూ జెర్సీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.