పీరియడ్స్ టైం లో షూటింగ్...  సాయి పల్లవి, శృతి హాసన్ ఏం చేస్తారో తెలుసా?

First Published May 25, 2024, 6:42 PM IST


నెలసరిలో షూటింగ్ చేయాల్సి వస్తే ఏం చేస్తారో చెప్పుకొచ్చారు సాయి పల్లవి, శృతి హాసన్ తో పాటు పలువురు హీరోయిన్స్. పీరియడ్స్ లో డాన్సులు కూడా చేశానన్న సాయి పల్లవి కీలక విషయాలు వెల్లడించారు. 
 

Sai Pallavi


ఆడవాళ్ళ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో పీరియడ్స్ ఒకటి. ముఖ్యంగా వివిధ రకాల వృత్తుల్లో సాగుతున్న మహిళలకు మరీ అసౌకర్యం. ఇక హీరోయిన్స్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్స్ కి వేళా పాళా ఉండదు. నెలసరిలో కూడా డాన్సులు, ఫైట్స్, ఛేజింగ్స్ చేయాల్సి రావచ్చు. పీరియడ్స్ సమయంలో షూటింగ్ చేయాల్సి వస్తే ఏం చేస్తారో తెలియజేశారు శృతి హాసన్, సాయి పల్లవి, హీనా ఖాన్, రాధికా ఆప్టే వంటి హీరోయిన్స్. 
 

Shyam Singha Roy

సాయి పల్లవి ఓ సందర్భంలో మాట్లాడుతూ... పీరియడ్స్ టైం లో డాన్స్ చేయడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. పలు చిత్రాల్లో పీరియడ్స్ సమయంలోనే నేను నృత్యాలు చేశాను. ప్రతికూల పరిస్థితులను పక్కన పెట్టి ముందుకు వెళ్లక తప్పదు. శ్యామ్ సింగరాయ్ మూవీలో శాస్త్రీయ నృత్యంతో కూడిన సాంగ్ కూడా నెలసరి సమయంలోనే చేశానని, అన్నారు. 

మరొక హీరోయిన్ శృతి హాసన్ నెలసరిలో షూటింగ్ చేయాల్సి వస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ...  పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. దాని వలన సరైన పెర్ఫార్మన్స్ ఇవ్వకపోవచ్చు. ఆ టైం లో ప్రశాంతంగా ఒక చోట కూర్చొని, వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. కానీ అన్ని సందర్భాల్లో అలా కుదరకపోవచ్చు. పీరియడ్స్ లో డాన్స్, స్టంట్స్ చేయడం కష్టంగా ఉంటుందని, అన్నారు. 

రాధికా ఆప్టే మాట్లాడుతూ.. పీరియడ్స్ ని నేను ఒక సమస్యల చూడను. గౌరవంగా భావిస్తాను. ఆ సమయంలో షూటింగ్ చేయను అని ఖచ్చితంగా చెప్పేస్తాను. ఆ విధంగా మరొకరికి స్ఫూర్తిగా ఉంటాను. పీరియడ్స్ గురించి చెప్పేందుకు సిగ్గుపడి మనం సమస్యల పాలు కాకూడదు. అలాగే ఎదుటివాళ్ళకు సమస్యలు తేకూడదు, అని అన్నారు.

నటి హీనా ఖాన్ పీరియడ్స్ లో షూటింగ్ చేయడం అత్యంత కఠిన వ్యవహారం అన్నారు. నెలసరి సమయంలో మొదటి రెండు రోజులు షూటింగ్ లో పాల్గొనకుండా ఉండే వెసులుబాటు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా అవుట్ డోర్ షూటింగ్స్, ఛేజింగ్ సీన్స్ చేయడం చాలా అసౌక్యరంగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్, డీ హైడ్రేషన్, బీపీ తగ్గిపోవడం, చర్మం మీద పొక్కులు వంటి సమస్యలు రావచ్చని, అన్నారు. 

షారుక్ ఖాన్ చెక్ దే ఇండియా మూవీ లేడీ హాకీ టీమ్ ప్రధాన నేపథ్యంగా తెరకెక్కింది. మరి స్పోర్ట్స్ డ్రామా అంటే అమ్మాయిలు పరుగులు పెడుతూ షూటింగ్ లో పాల్గొనాలి. ఈ మూవీలో హాకీ టీమ్ కెప్టెన్ రోల్ చేసిన విద్యా మాల్వాడే చిత్ర యూనిట్ తమకు తగు ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఓ మహిళను ప్రత్యేకంగా నియమించి హాకీ ప్లేయర్స్ గా నటిస్తున్న అమ్మాయిల పీరియడ్స్ టైం ట్రాక్ చేయమని చెప్పారట. నెలసరిలో ఉన్న అమ్మాయిలకు తగు విశ్రాంతి ఇచ్చేవారట. 
 

click me!