అప్పట్లో చాలా మంది ముంబయి హీరోయిన్లే వచ్చేవారని, వారికి తెలుగు వచ్చేది కాదు, ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి, మనకు కష్టం, అయితే ఇంగ్లీష్ మ్యానేజ్ చేస్తామని, కానీ ఏదైనా తప్పు అయితే పరువు పోతుందేమో అనే భయంతో తాను హీరోయిన్లతో ఇంగ్లీష్ మాట్లాడేవాడిని కాదని, వారికి దూరంగా ఉండేవాడినని తెలిపారు శ్రీకాంత్. పార్టీలు, పబ్‌లకు వెళ్లకపోవడానికి అది కూడా ఓ కారణమన్నారు. ఓపెన్ హార్ట్ వీత్ ఆర్కే ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు శ్రీకాంత్. ఇప్పుడు ఆ క్లిప్ వైరల్‌గా మారింది. ఈ క్రమంలో శ్రీకాంత్ వీక్‌నెస్ తెలిసిపోయింది.