మ్యారేజ్‌పై ప్రభాస్ కామెంట్‌ వెనక అర్థం అదేనా?.. పెళ్లిపై ఆయన ఫైనల్‌ స్టేట్‌మెంటా?

First Published May 25, 2024, 3:41 PM IST

ప్రభాస్‌ తన పెళ్లిపై ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఇది ఆయన ఫైనల్‌ స్టేట్‌మెంటా అనే డౌట్‌ వ్యక్తమవుతుంది. 
 

 ప్రభాస్‌ పెళ్లి అనేది ఎప్పటికీ సాగే చర్చ. తరచూ ఈ వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటున్నాయి. ఇక రూమర్లకి అంతేలేదు. అనుష్కని పెళ్లిచేసుకుంటున్నాడని చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు వాటికి సంబంధించిన క్లారిటీ లేదు. అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి. 

అనుష్క కూడా మ్యారేజ్‌ చేసుకోకపోవడంతో ఈ వార్తలు ఊపందుకుంటున్నాయి. ఇటీవల కూడా మరోసారిఈ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత మరో వ్యాపారవేత్తని అనుష్క పెళ్లి చేసుకుంటుందన్నారు. అది కూడా రూమర్గానే మిగిలింది. ఆమె కూడా పెళ్లి విషయంలో ఎన్ని వార్తలు వచ్చినా సైలెంట్‌గానే ఉండిపోతుంది. 
 

అయితే ఫస్ట్ టైమ్ ప్రభాస్‌ మ్యారేజ్‌పై స్పందించారు. ఇటీవల `కల్కి2898ఏడీ` బుజ్జి పరిచయ ఈవెంట్‌లో అసలు విషయం చెప్పాడు. అందులో యాంకర్‌ సుమ.. ఇటీవల మీరు పెట్టిన పోస్ట్ తో మా అమ్మాయిలు అల్లాడిపోయారు, ఎక్కడ పెళ్లి చేసుకుంటారో అని టెన్షన్‌ పడ్డారని ప్రశ్నించింది. దీనికి ప్రభాస్‌ స్పందిస్తూ, వాళ్ల కోసమే మ్యారేజ్‌ చేసుకోవడం లేదు అని తెలిపారు. అమ్మాయిలు అలా ఫీల్‌ కాకూడదనే తాను మ్యారేజ్‌ చేసుకోవడం లేదని ప్రభాస్‌ చెప్పారు. 
 

అయితే ఇదిప్పుడు సరికొత్త వాదనకు తెరలేపుతుంది. పెళ్లి విషయంలో ప్రభాస్‌ ఫైనల్‌ నిర్ణయం అదేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆయన ఇక మ్యారేజ్‌ చేసుకోడా? అనే డౌట్‌ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ప్రభాస్‌  స్టేట్‌మెంట్‌ వెనుక అర్థం ఆయన ఇక మ్యారేజ్‌ చేసుకోకపోవడమేనా అని అంటున్నారు. ప్రభాస్ పెళ్లి అనే దానికి దూరంగా ఉండాలనుకుంటున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆయన ఈ మాట కేవలం సరదాకే చెప్పాడా? లేక సీరియస్‌గా తన మనసులో అదే ఉందా? అనేది తెలియాల్సి ఉంది. 
 

ఇక ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` విడుదలకు రెడీ అవుతుంది. టీమ్‌ ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూ చేశారు. బుజ్జి పరిచయంతో ఈ ప్రచార పర్వం ప్రారంభమైంది. వరుసగా దేశ వ్యాప్తంగా పలు ఈవెంట్లకి ప్లాన్‌ చేస్తున్నారట. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఏకంగా యాభై కోట్ల వరకు ఈ మూవీ ప్రమోషన్స్ కి ఖర్చు చేస్తున్నారని సమాచారం. 
 

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీని మైథలాజికల్‌, సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నారు. భవిష్యత్‌ కాలానికి మహాభారతంలోని అంశాలకు ముడిపెడుతూ టైమ్‌ ట్రావెల్‌ చిత్రంగా దీన్నిరూపొందిస్తున్నారట. భవిష్యత్‌లో 2898 నుంచి బ్యాక్‌ ఆరు వేల సంవత్సరాలకు కథ వెళ్తుందని తెలుస్తుంది. ఈ రెండింటికి ఎలా ముడిపెట్టాడు, ఎలా కన్విన్స్ చేశాడనేది ఆసక్తికరం. 
 

ఈ సినిమాలో భారీ కాస్టింగ్‌ ఉండబోతుంది. ప్రభాస్‌తోపాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికాపదుకొనె, దిశా పటానీ, అలాగే గెస్ట్ రోల్స్ లో విజయ్‌, నాని, దుల్కర్‌, మృణాల్‌ వంటి వారు కనిపిస్తారని సమాచారం. అశ్వనీ దత్‌ సుమారు 700కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కించారు. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా ఓ గ్లోబల్ ఫిల్మ్ రేంజ్‌లో దీన్ని తెరకెక్కించబోతున్నారు. 

click me!