సలార్ అసలైన బడ్జెట్ లెక్క ఇదే.. మరీ ఇంత తక్కువా, ఓపెనింగ్స్ తోనే లాభాలు గ్యారెంటీ ?

Published : Dec 18, 2023, 01:17 PM IST

సలార్ కి నిర్మాతలు ఎంత బడ్జెట్ పెట్టారు.. ఎంత వసూళ్లు సాధిస్తే సలార్ చిత్రం సేఫ్ అవుతుంది లాంటి విషయాల గురించి ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది. 

PREV
16
సలార్ అసలైన బడ్జెట్ లెక్క ఇదే.. మరీ ఇంత తక్కువా, ఓపెనింగ్స్ తోనే లాభాలు గ్యారెంటీ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సలార్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలుమార్లు వాయిదా పడ్డ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.  దీనితో ఇటీవల సలార్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ ట్రైలర్ సంతృప్తినివ్వలేదు. ఎక్కువగా సన్నివేశాలన్నీ కేజీఎఫ్ చిత్రాన్ని పోలి ఉన్నాయి. 

26

దీనితో ప్రశాంత్ నీల్ తన సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఆసక్తి కూడా పెరుగుతోంది. నిజంగానే సలార్ కి, కేజీఎఫ్ మధ్య సంబంధం ఉందా అని అంతా ఎదురుచూస్తున్నారు.  సలార్ ట్రైలర్ మొత్తం కెజిఎఫ్ కి మరో వర్షన్ లాగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో నేడు సలార్ చిత్ర యూనిట్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతోంది. 

36

మరికొద్ది రోజుల్లోనే సలార్ రిలీజ్ ఉండడంతో దేశం మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆ ఫీవర్ కనిపిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ లేదు. దీనితో సలార్ చిత్రంతో అయినా ప్రభాస్ పాన్ ఇండియా బాక్సాఫీస్ పై గర్జించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సలార్ బడ్జెట్ గురించి చర్చ జరుగుతోంది. 

46

సలార్ కి నిర్మాతలు ఎంత బడ్జెట్ పెట్టారు.. ఎంత వసూళ్లు సాధిస్తే సలార్ చిత్రం సేఫ్ అవుతుంది లాంటి విషయాల గురించి ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది. సలార్ మూవీకి 300 నుంచి 400 కోట్ల మధ్యలో  బడ్జెట్ ఖర్చు అయి ఉంటుందనే అంచనా ఉంది. అయితే తాజాగా అసలైన బడ్జెట్ లెక్కలు బయటకి వచ్చినట్లు తెలుస్తోంది. 

 

56

తాజా లెక్కలు షాకింగ్ గా ఉన్నాయి. సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ ఖర్చు చేసింది ఇంత తక్కువేనా అని ఆశ్చర్యపోవాల్సిందే. స్టార్స్ రెమ్యునరేషన్స్ తో కలుపుకుని సలార్ చిత్రానికి ఖర్చయిన మొత్తం కేవలం 270 కోట్లేనట. 

 

66

సలార్ చిత్రానికి ఉన్న హైప్ దృష్ట్యా ఈ బడ్జెట్ ని రికవరీ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు అని అంటున్నారు. సూపర్ హిట్ టాక్ కనుక వస్తే ఓపెనింగ్ వీకెండ్ లోనే బడ్జెట్ మొత్తం రికవరీ అయిపోతుంది. ఆ తర్వాత లాభాల పంటే అని అంటున్నారు. ప్రశాంత్ నీల్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం డబ్బు ఎక్కడ వృధా చేయలేదట. తక్కువ బడ్జెట్ లోనే క్వాలిటీఅవుట్ పుట్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని బట్టి, టాక్ ని బట్టి బయ్యర్లకు లాభాలు ఉంటాయి. నిర్మాతలు మాత్రం సేఫ్. 

 

Read more Photos on
click me!

Recommended Stories