ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్‌కి `రెబల్‌`, `బిల్లా` సినిమాలనే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

Published : Oct 16, 2022, 05:30 PM ISTUpdated : Oct 16, 2022, 06:01 PM IST

ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలు రీ రిలీజ్‌ చేస్తున్నారు. `రెబల్` ఇప్పటికే రిలీజ్‌ కాగా, `బిల్లా` బర్త్ రోజు రిలీజ్‌ చేయబోతున్నారు. అయితే ఈ రెండు సినిమాలను ఎంచుకోవడానికి అసలు కారణం  

PREV
16
ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్‌కి `రెబల్‌`, `బిల్లా` సినిమాలనే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

టాలీవుడ్‌(Tollywood)లో ఓ కొత్త ట్రెండ్‌ ఊపందుకుంది. స్టార్‌ హీరోల పుట్టిన రోజుల సందర్భంగా వారి సూపర్‌ హిట్‌ చిత్రాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు. థియేటర్లలో మళ్లీ ఆయా చిత్రాలను రిలీజ్‌ చేస్తున్న నేపథ్యంలో వాటికి విశేష ఆదరణ దక్కుతుంది. ముఖ్యంగా అభిమానులు ఆయా చిత్రాలకు బ్రహ్మారథం పడుతున్నారు. థియేటర్లలో మరోసారి రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్‌ (Mahesh) `పోకిరి`, పవన్‌(Pawan Kalyan) `తమ్ముడు`,`జల్సా` చిత్రాలు రిలీజ్‌ చేశారు. జల్సా ఏకంగా నాలుగు కోట్లు వసూలు చేయడం విశేషం.

26

ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌, డార్లింగ్ ప్రభాస్(Prabhas) వంతు వచ్చింది. ఆయన బర్త్ డేకి `బిల్లా`, `వర్షం` చిత్రాలను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అనూహ్యంగా `వర్షం` పక్కకు వెళ్లింది. `రెబల్`(Rebal) తెరపైకి వచ్చింది. శనివారం(అక్టోబర్‌ 15)న `రెబల్‌` చిత్రాన్ని విడుదల చేయగా, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ చేశారు. దీనికి మంచి ఆదరణ దక్కింది.

36

మరోవైపు డార్లింగ్‌ బర్త్ డే కారణంగా `బిల్లా`(Billa) చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. `బిల్లా`4కే వెర్షన్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు మెహర్‌ రమేష్‌, గోపీకృష్ణా మూవీస్‌ సంస్థ నిర్వహకులు, కృష్ణంరాజు కూతురు ప్రసీద తెలిపారు. ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లని యూకే ఇండియా డయాబెటిక్‌ ఫుట్ ఫౌండేషన్‌కి విరాళంగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో కృష్ణంరాజు భాగస్వామిగా ఉండటం కారణంగా ఆ సంస్థకి డొనేట్‌ చేస్తున్నట్టు తెలిపారు. 

46

ఇదిలా ఉంటే మహేష్‌, పవన్‌ బర్త్ డేలకు బ్లాక్‌ బస్టర్స్ హిట్‌ సినిమాలను రీ రిలీజ్‌ చేశారు. కానీ ప్రభాస్‌ బర్త్ డేకి మాత్రం రెండూ డిజాస్టర్‌ సినిమాలను ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. అందుకు కారణమేంటనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. దీని వెనకాల ఉన్న అసలు కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఓ విషయం తెలుస్తుంది. 

56

కృష్ణంరాజు ఇటీవల కన్నుమూసిన విజయం తెలిసిందే. సెప్టెంబర్‌ 11న ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు జ్ఞాపకార్థంగా, ప్రభాస్‌, కృష్ణంరాజు కలిసి నటించిన సినిమాలను ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ, ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. `రెబల్‌`, `బిల్లా`లో కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటించారు. రెండింటిలోనూ ఆయన బలమైన పాత్రలు పోషించారు. పెదనాన్న కృష్ణంరాజు అంటే డార్లింగ్‌కి ఎంతో ఇష్టం. ఆయనే `బిల్లా`లో కృష్ణంరాజు కోసం ప్రత్యేకంగా రోల్‌ని డిజైన్‌ చేయించారట. 
 

66
Rip Krishnam Raju

అలా ఈరెండు చిత్రాల్లో కృష్ణంరాజు భాగమయ్యారు. మరోసారి వీరిద్దరిని తెరపై చూడాలనే ఉద్దేశ్యంతో అదే సమయంలో కృష్ణంరాజుకి ఓ ట్రిబ్యూట్‌లా ఉంటుందనే ఆలోచనతో ఈరెండు సినిమాలను మళ్లీ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీంతో పెద్దగా ఆదరణ పొందని చిత్రాలైనా ఈ రెండింటిని ఎంపిక చేసుకోవడం జరిగిందని సమాచారం. ఇక ఈ నెల 23న విడుదల కాబోతున్న `బిల్లా` చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. అనుష్క, హన్సిక, నమిత హీరోయిన్లుగా నటించారు. ఇందులో డార్లింగ్‌ ద్విపాత్రాభినయంచేయగా, కృష్ణంరాజు ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపించారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories