ఈసారి నువ్వు చాలా పెద్ద హీరోతో హీరోయిన్ గా చేయబోతున్నావు అని అన్నారు. ఎవరా హీరో అని అడిగితే.. ఎవరో కాదు ఎన్టీఆర్ గారు అని చెప్పారు. నేను నిజంగానే షాక్ అయ్యాను. ఏంటి సార్.. నేను ఆయనతో ఆల్రెడీ మనవరాలిగా నటించాను. ఇప్పుడు హీరోయిన్ గా ఎలా నటించమంటారు అని అడిగిందట. ఏమీ కాదు అదంతా నేను చూసుకుంటాను అని రాఘవేంద్ర రావు మాట ఇచ్చారట. ఎన్టీఆర్ కూడా శ్రీదేవి హీరోయిన్ గా వద్దు అన్నట్లు చెప్పారట. కానీ రాఘవేంద్ర రావు కాంబినేషన్ బాగా ఉంటుంది అని చెప్పి కన్విన్స్ చేశారట. ఆ విధంగా ఎన్టీఆర్, శ్రీదేవి వేటగాడు చిత్రంలో నటించి మెప్పించారు.