అయితే ఈ రెండు చిత్రాలతోనూ ఉత్తమ దర్శకునిగా నందిని సొంతం చేసుకున్నారు శేఖర్. ఆ పై వచ్చిన శేఖర్ సినిమా ‘హ్యాపీ డేస్’ టైటిల్ కు తగ్గట్టుగానే ఎందరికో ఆనందమైన రోజులు చూపించింది.
రానా హీరోగా నటించిన తొలి చిత్రం ‘లీడర్’ శేఖర్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ” చిత్రాలతో తనదైన మార్కు చూపిస్తూ ఆకట్టుకున్నారు శేఖర్.