రాజమౌళికి నరకం చూపించిన రాఘవేంద్రరావు, ఏం జరిగిందంటే?

First Published Sep 14, 2024, 12:32 PM IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకుని, తెలుగు సినీ కీర్తిని ప్రాంతీయ, జాతీయ స్థాయిని దాటించి..


 ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli).. అనేది ఇప్పుడు కేవలం ఒక పేరు కాదు, అదొక బ్రాండ్‌. ఆయన దర్శకత్వంలో నటించాలని ప్రతి హీరో కోరుకుంటారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకుని, తెలుగు సినీ కీర్తిని ప్రాంతీయ, జాతీయ స్థాయిని దాటించి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు.


అలాంటి రాజమౌళి తన గురువైన రాఘవేంద్రరావు  గురించి ఏం చెప్తారు అనేది అందరికీ ఆసక్తే. ఎందుకంటే కేవలం తన శిష్యుడుగానే కాకుండా రాజమౌళి తొలి చిత్రానికి అన్ని తానై పర్యవేక్షకుడుగా ఉంటూ ముందుకు నడిపించారు ఆయన.

ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా ‘స్టూడెంట్‌ నెం.1’ (Student No: 1) తో రాజమౌళి దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం గురువుగా ఆనందం కలిగించింది.
 

Latest Videos



ఆ తర్వాత  రాజమౌళి దర్శకత్వంలో రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ హీరోగా ఓ సినిమా ప్లాన్‌ చేశారు. అందుకు సంబంధించి కథా చర్చలు కూడా జరిగాయి. ఆ చిత్రానికి ‘విజయ సింహ’ అనే పేరును కూడా అనుకున్నారు.

అదితి అగర్వాల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. దాదాపు నాలుగు నెలల పాటు ఆ స్క్రిప్ట్‌పై పనిచేశారు. ఏమైందో ఏమో తెలియదు. ఆ సినిమా పట్టాలెక్కలేదు ఆ తర్వాత  రాజమౌళి ‘సింహాద్రి’ (Simhadri) తీసి హిట్‌ కొట్టారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

photos-soundarya lahari


ఇక రాజమౌళి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన  బాహుబలి సినిమాకి రాఘవేంద్రరావు కూడా ఒక నిర్మాత. ఇక రాఘవేంద్రరావు ఓ సారి తనకు నరకం చూపించారని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఎప్పుడూ అంటే...ఆయనతో పాటు కారులో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అని చెప్పుకొచ్చారు. 


రాజమౌళి మాట్లాడుతూ... రాఘవేంద్రరావు గారి సీటు కవర్ చాలా తెల్లగా ఉంటుంది. ముట్టుకుంటే మాసిపోయేలా మల్లెపూవులా ఉంటుంది. ఆయనతో ఓ రోజు పని ఉండి మాట్లాడటానికి వెళ్లాను. అప్పుడే ఆయన బయిటకు పని మీద వెళ్తున్నారు.

చూస్తే డ్రైవర్ లేరు. ఆయన డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఉన్నారు. నన్ను కారు ఎక్కమన్నారు. కానీ నేను ఎక్కడ కూర్చోవాలో అర్దం కాలేదు. రాఘవేంద్రావుగారి ప్రక్కన ప్రంట్ సీట్ లో కూర్చుందామంటే ఎప్పుడూ ఆయన కూర్చునే సీట్ లో కూర్చోవాలి. 


డైరక్టర్ గారి సీట్ లో కూర్చోలేము. అలాగని వెనకాల కూర్చుందామంటే ఆయన డ్రైవర్ గా ఫీలవుతారనే భయం. ఏం చేయాలో అర్దం కాక తప్పనిసరి పరిస్దితుల్లో భయం భయంగా డోర్ తీసి  ముందు సీట్లో ఆయన ప్రక్కన కూర్చున్నాను. కానీ సరిగ్గా కంఫర్ట్ గా  కూర్చోలేకపోయాను.

గాల్లో కూర్చున్నట్లుగా సీట్లో ముందుకు కూర్చున్నాను. కూర్చుని కూర్చోనట్లుగా.డైరక్టర్ గారు డ్రైవ్ చేస్తుంటే నేను ప్రక్కన కూర్చున్నానే ఆనదం లేదు.  ఓ రకంగా నరకం చూపించారు అంటూ నవ్వుతూ చెప్పారు రాజమోళి. 
 

రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. బాహుబలి కథ వినమంటే రాజమౌళి కదా అక్కర్లేదు అన్నాను. షూట్ మొదలయ్యాక లెంగ్త్ చాలా ఎక్కువ వస్తుంది, ఒకసారి కథ వినండి అని రాజమౌళి అడగడంతో విన్నాను. మూడు గంటల పాటు షాట్స్ తో సహా కథని చెప్పాడు.

ఎక్కడా కట్ చేయాలి అనిపించలేదు. దీంతో సినిమాని రెండు పార్టులు తీయమని చెప్పాను. కానీ బడ్జెట్ పెరిగిపోయింది. పెట్టిన బడ్జెట్ వస్తుందా రాదా అని చాలా భయపడ్డాం సినిమా రిలీజ్ అయ్యేవరకు అని చెప్పారు.

click me!