వెంకటేష్ మూవీ వల్ల నటి కెరీర్ నాశనం ?.. ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలో, మొత్తం చేసింది దర్శకుడే

Published : Feb 08, 2025, 11:07 AM IST

Victory Venkatesh: హీరోలకు, హీరోయిన్లకు కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ సహజంగానే ఉంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం హీరోయిన్లని డిస్ట్రబ్ చేసేలా ఉంటాయి. వెంకటేష్ తో కలసి నటించిన ఒక హీరోయిన్ కి అలాంటి పరిస్థితి ఎదురైంది. 

PREV
14
వెంకటేష్ మూవీ వల్ల నటి కెరీర్ నాశనం ?.. ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలో, మొత్తం చేసింది దర్శకుడే
Venkatesh

విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా సంక్రాంతికి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. వెంకటేష్ తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉండే హీరో. సైలెంట్ గా తన పని తాను చేసుకుని వెళతాడు. హీరోలకు, హీరోయిన్లకు కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ సహజంగానే ఉంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం హీరోయిన్లని డిస్ట్రబ్ చేసేలా ఉంటాయి. 

 

24

వెంకటేష్ తో కలసి నటించిన ఒక హీరోయిన్ కి అలాంటి పరిస్థితి ఎదురైంది. ఆ సినిమా వల్ల తన కెరీర్ నాశనం అయిందని ఆమె బాధపడినట్లు వార్తలు కూడా వచ్చాయి. అసలేం జరిగిందంటే.. క్రేజీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఆ మూవీలో పాయల్ పెర్ఫామెన్స్ కి యువత ఫిదా అయ్యారు. పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో నెక్స్ట్ లెవల్ కి చేరుకోవడం ఖాయం అని అంతా భావించారు. 

 

34

డైరెక్టర్ బాబీ ఆమెకి వెంకీ మామ చిత్రంలో వెంకటేష్ కి హీరోయిన్ గా  ఛాన్స్ ఇచ్చారు. వెంకటేష్ ని మ్యాచ్ చేసేందుకు పాయల్ రాజ్ పుత్ ని డైరెక్టర్ బాబీ కాస్త పెద్ద అమ్మాయిలా చూపించారు. కానీ ఈ చిత్రంలో ఆమె లుక్స్ ఆంటీలా కనిపించాయి. ఈ మూవీలో నాగ చైతన్యకి హీరోయిన్ గా రాశి ఖన్నా నటించింది. ఆమెని మాత్రం యంగ్ గా చూపించి తనని మాత్రం ఆంటీలా ప్రోజెక్ట్ చేశారు అని పాయల్ సన్నిహితుల వద్ద వాపోయింది. 


Also Read: టాలీవుడ్ టాప్ 5 బెస్ట్ యాక్షన్ ప్లస్ లవ్ చిత్రాలు.. వాలెంటైన్స్ డే రోజు సిన్సియర్ లవర్స్ కి మాత్రమే ఇవి

44

వాస్తవానికి పాయల్ రాజ్ పుత్.. రాశి ఖన్నా కంటే వయసులో చిన్నది. డైరెక్టర్ బాబీ  చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని పాయల్ రాజ్ పుత్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ చిత్రం వల్ల తన కెరీర్ నాశనం అయ్యే పరిస్థితి అని సన్నిహితులతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పాయల్ రాజ్ పుత్ కి కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు రాలేదు. కానీ కొన్ని బోల్డ్ చిత్రాల్లో మాత్రం ఆఫర్స్ వస్తున్నాయి. 

 

Read more Photos on
click me!

Recommended Stories