Sakshi Agarwal : ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్‌ను వివాహం చేసుకున్న నటి సాక్షి అగర్వాల్, తన వ్యక్తిగత జీవితం గురించి ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడించారు. నయనతార, ఆర్య, జై, నజ్రియా నటించిన అట్లీ 'రాజా రాణి'లో సాక్షి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేశారు. ఆమె నటనలో కొనసాగించారు కానీ ఇంకా ప్రధాన హీరోయిన్ స్థాయిని అందుకోలేదు.