నాగచైతన్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్..
`తండేల్` మూవీ ఫస్ట్ డే సుమారు రూ. 18కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. సుమారు పది కోట్ల షేర్ ఓపెనింగ్స్ ద్వారా రాబట్టమంటే మామూలు విషయం కాదు. చైతూ కి వరుసగా మూడు నాలుగు పరాజయాలున్నాయి. అయినా ఈ రేంజ్‌లో కలెక్షన్లు అంటూ గొప్ప విసయమే. ఈ మూవీ మరింతగా పుంజుకునే అవకాశం ఉంది.
`తండేల్` తెలుగుతోపాటు, తమిళం, హిందీలో కూడా విడుదలైంది. తెలుగులోనే మేజర్‌గా కలెక్షన్లని సాధించింది. తమిళంలో అంతగా ప్రభావం లేదని, హిందీలోనూ ప్రభావం చూపించలేదని తెలుస్తుంది. అయితే నార్త్‌లో కాస్త పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది. శని, ఆదివారాల్లో అక్కడి రెస్పాన్స్ ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.