ఇప్పుడు మీడియా కథనాల ప్రకారం అక్షయ్ కుమార్ ఆస్తుల విలువ దాదాపు 2700 కోట్లు. రీసెంట్ గా మళ్ళీ అక్షయ్ బాక్సాఫీస్ వద్ద కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారు అక్షయ్. సామ్రాట్ పృథ్వీరాజ్, బడే మియా చోటే మియా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
అయినా అక్షయ్ భయపడలేదు. సినిమా స్కై ఫోర్స్ ఆయన అదృష్టాన్ని మళ్ళీ మార్చింది.బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ ప్రయాణం ఆయన పట్టుదల, దృఢమైన మనస్తత్వం, ఏ ఓటమికీ లొంగని స్వభావానికి నిదర్శనం.
వ్యక్తిగత, వృత్తిపరమైన కష్టాలను ఎదుర్కొని.. కింద పడ్డప్పుడల్లా అంతే బలంగా వెనక్కి వచ్చేవాడు అక్షయ్. రీ ఎంట్రీలు అతనికి బాగా కలిసి వచ్చాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ 34 ఏళ్ళ ప్రయాణం.. కొత్త నటులకు స్ఫూర్తిదాయకం.