నా కథలో వేలు పెడితే కుదరదు... సూపర్ స్టార్ రజినీకాంత్ కే కండిషన్స్ పెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా? 

First Published | Aug 19, 2024, 7:22 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫేమ్, ఇమేజ్ ఏమిటో తెలిసిందే.  ఆయనతో మూవీ చేయాలని ప్రతి దర్శకుడు కలగంటాడు. కానీ ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం రజినీకాంత్ కి కండిషన్స్ పెట్టాడట... 
 

భిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు పా రంజిత్. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ లేటెస్ట్ మూవీ తంగలాన్. విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. రూ. 50 కోట్ల వసూళ్లు దాటేసింది. తంగలాన్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా.  దర్శకుడు పా రంజిత్ తంగలాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. 

Pa Ranjith

కాగా రంజిత్ ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా కండిషన్స్ పెట్టాడట. పా రంజిత్ మూడో చిత్రం కబాలి. అప్పట్లో ఈ మూవీ ఎంత పెద్ద సెన్సేషనో తెలిసిందే. ఇండియా వైడ్ కబాలి ఫీవర్ నడిచింది. కబాలి పేరిట నాణాలు విడుదలయ్యాయి, ఫ్లైట్  నడిచాయి. ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించే సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలు పా రంజిత్ తెలియజేశాడు. 


Kabali

 కబాలి కథ తాను ఎలా అనుకున్నాడో అలానే తెరకెక్కించాలని పా రంజిత్ భావించాడట. కబాలి కథ విన్న రజినీకాంత్ ఎగ్జైట్ ఫీల్ అయ్యాడట. ఈ కథలో నాకు ఎక్కువ ఫైట్స్ లేవు, డ్యూయట్స్ లేవు. పెద్ద వయసు. పైగా ఓ కూతురు ఉంది. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ, ఈ మూవీ మనం ఖచ్చితంగా చేద్దాము, అన్నాడట. 

అనంతరం రజినీకాంత్ కి పా రంజిత్ షరతులు పెట్టాడట. సర్.. ఇది నా స్క్రిప్ట్. ఇందులో ఎలాంటి మార్పులు చేయడానికి నేను ఒప్పుకోను. దానికి మీరు ఒప్పుకుంటే సినిమా చేద్దాం, లేదంటే ఇక్కడితో వదిలేద్దాం... అని రంజిత్ అన్నాడట. అందుకు రజినీకాంత్ ఒప్పుకున్నాడట. 
 

కబాలి విడుదలై విజయం సాధించింది. పా రంజిత్ ని పిలిచిన రజినీకాంత్... నీతో మరో తొమ్మిది సినిమాలు చేయాలని ఉంది. చేద్దామా అని అన్నాడట. కబాలి తర్వాత చిత్రం కూడా పా రంజిత్ హీరో రజినీకాంత్ తో చేశాడు. వీరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం కాలా ఓ మోస్తరు విజయం అందుకుంది. 

kabali

ప్రస్తుతం రజినీకాంత్ వేట్టైయాన్ మూవీ చేస్తున్నారు. టీజీ జ్ఞానవేల్ దర్శకుడు. వేట్టైయాన్ అనంతరం రజినీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మూవీ చేయనున్నాడని సమాచారం. 

Latest Videos

click me!