విజయేంద్రప్రసాద్‌ ఫోన్‌లో సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఫోటో.. కారణం తెలిస్తే షాక్‌.. అది రాజమౌళికి కూడా సాధ్యం కాదట.

First Published | Aug 18, 2024, 11:11 PM IST

విజయేంద్రప్రసాద్‌.. ఫోన్‌లో డీపీగా ఎవరి ఫోటో ఉంటుందో తెలుసా? ఎవరూ ఊహించలేరు. ఆ స్టార్‌ డైరెక్టర్‌నలా తాను, రాజమౌళి చేయలేమంటూ షాకిచ్చాడు. 
 

విజయేంద్రప్రసాద్‌ స్టార్‌ రైటర్‌ గా రాణిస్తున్నారు. ఆయన ఇచ్చిన కథలే పాన్‌ ఇండియాని షేక్‌ చేశాయి. చేస్తున్నాయి. రాజమౌళి సినిమాలకు ఆయనే కథలు అందిస్తున్న విషయం తెలిసిందే. తండ్రి కథలతోనే సంచలనాలు క్రియేట్‌ చేస్తున్నారు రాజమౌళి. ప్రస్తుతం టాలీవుడ్‌లో, ఇండియాలో రాజమౌళిని మించిన దర్శకుడు లేడు. `బాహుబలి 2` కలెక్షన్లు దాటేసినిమా తీసిన దర్శకుడు.. రాజమౌళిని మించిన డైరెక్టర్‌ అవుతాడు. ప్రస్తుతానికి ఎవరూ లేరు. మున్ముందు వచ్చే అవకాశాలు లేకపోలేదు. 

అయితే భారత్‌ మొత్తం మెచ్చిన దర్శకుడిగా రాణిస్తున్న రాజమౌళి.. అంటే అందరికి ఇష్టమే. ఆయన మేకింగ్‌ గురించి తెలుసుకోవాలని, నేర్చుకోవాలని అనుకుంటారు. ఆయన్ని ఫాలో అవుతుంటారు. ఆయనలా సినిమాలు తీయాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ తండ్రి విజయేంద్రప్రసాద్‌ మాత్రం మరోడైరెక్టర్ ని ఇష్టపడుతున్నాడు. ఆయనలా తాము సినిమా తీయాలనుకుంటున్నారు. 
 


ఆ డైరెక్టర్‌ ఎవరో కాదు పూరీ జగన్నాథ్‌. విజయేంద్రప్రసాద్‌ ఫోన్‌లో పూరీ జగన్నాథ్‌ ఫోటో పెట్టుకోవడం విశేషం. తెలుగు దర్శకుల్లో మీకు నచ్చిన దర్శకుడు ఎవరు? ఎవరిని అభినందించాలనిపిస్తుందనే ప్రశ్న విజయేంద్రప్రసాద్‌కి ఎదురయ్యింది. దానికి ఆయన తన ఫోన్‌లో ఉన్న పూరీ జగన్నాథ్‌ ఫోటో చూపించడం విశేషం. `బాహుబలి 2`తో ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన రాజమౌళి ఫోటో కాకుండా పూరీ ఫోటో పెట్టుకోవడానికి కారణమేంటనేది అడిగితే.. 
 

పూరీ హీరోని చూపించే విధానం, ఎమోషన్‌ పలికించే తీరు అద్భుతం అని చెప్పాడు. సినిమాల్లో విలన్‌ని కొట్టాలంటే నాకుగానీ, రాజమౌళికి గానీ ఓ పది నిమిషాలు పడుతుంది. కానీ పూరీ వితిన్‌ సెకన్‌లో ఆ పనిచేయిస్తాడు. ఆడియెన్స్ కి ఆ ఫీల్‌ని తీసుకొస్తాడు. విలన్‌ని కొట్టాలనే ఫీలింగ్ ని ముందు ఆడియెన్స్ లో తెప్పిస్తాడు. ఆ వెంటనే హీరోతో కొట్టిస్తాడు. ఏమాత్రం గ్యాప్‌తీసుకోడు. ఆ ఎమోషన్‌ తీసుకురావడమనేది ఈజీ కాదని, ఆ టెక్నీక్‌ అర్థం కావడం లేదని, అందుకే ఆయన్నుంచి ఇది నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా ఫోటో పెట్టుకున్నట్టు తెలిపారు విజయేంద్రప్రసాద్‌. 
 

పూరీ జగన్నాథ్‌ సినిమాలు, హీరో పాత్రల వల్ల యువత చెడిపోతుందనే విమర్శపై స్పందిస్తూ, అలాంటి కథలను తాను రాయలేను అని, రాసే సత్తా ఉండి, కామెంట్‌ చేయాలని, తనకు ఆ కెపాసిటీ లేదని, అందుకే పూరీ టాలెంట్‌కి అభినందనలు తెలియజేస్తానని చెప్పారు విజయేంద్రప్రసాద్‌. అదేసమయంలో తాను అదే రంగంలో ఉండి, ఆయనపై ఇలాంటి కామెంట్లు చేయలేనని తెలిపారు విజయేంద్రప్రసాద్‌. ప్రస్తుతం ఆయన రాజమౌళి-మహేష్‌ బాబు సినిమాకి కథ అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. 
 

ఇక పూరీ జగన్నాథ్‌.. `పోకిరి`, `ఇడియట్‌`, `దేశముదురు`, `బద్రి` వంటి సినిమాలతో ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఇప్పుడు దర్శకుడిగా సక్సెస్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఇటీవల రామ్‌తో `డబుల్‌ ఇస్మార్ట్` మూవీ చేశాడు పూరీ. ఇది నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటుంది. పరాజయం దిశగా వెళ్తుందని సమాచారం.

Latest Videos

click me!