ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు... బాలీవుడ్ నటుడు కామెంట్స్ వెనుక ఆంతర్యం తెలిస్తే షాక్ అవుతారు!

First Published | Aug 18, 2024, 11:32 PM IST


బాలీవుడ్ ప్రముఖులు ప్రభాస్ పై అనుచిత కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. తాజాగా ఓ ప్రముఖ నటుడు ప్రభాస్ జోకర్ లా ఉన్నాడని చెప్పడం చర్చకు దారి తీసింది. 
 

ప్రభాస్ ని బాలీవుడ్ ప్రముఖులు విమర్శించడం కొత్తేమీ కాదు. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన బాహుబలి, బాహుబలి 2 సైతం విమర్శలపాలయ్యింది. దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ చిత్రాలను కాపీ చేశాడని అన్నాడు. వివాదాస్పద బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ మరింత దారుణంగా ట్రోల్ చేశాడు. బాహుబలి చిత్రాలను ఆయన కార్టూన్ మూవీస్ తో పోల్చాడు. 

బాలీవుడ్ పెద్దలు ప్రభాస్ పై విమర్శలు చేయడం వెనుక కారణం ఉంది. ఓ సౌత్ ఇండియా హీరో ఇండియన్ వైడ్ మార్కెట్ కలిగి ఉండటం జీర్ణించుకోలేని విషయం. ఒకప్పుడు దేశంలో అతిపెద్ద చిత్ర పరిశ్రమగా బాలీవుడ్ ఉండేది. షారుక్, సల్మాన్, అమీర్ ఇండియన్ బాక్సాఫీస్ కింగ్స్ గా ఉండేవారు. 


సమీకరణాలు మారాయి. ఇప్పుడు దేశంలో టాలీవుడ్ అతిపెద్ద చిత్ర పరిశ్రమ. ఇండియా వైడ్ మార్కెట్ ఉన్న హీరోలు ఐదారుగురు ఉన్నారు. ప్రభాస్ తో సినిమా అంటే కనీసం రూ. 500 కోట్లు కావాలి. ప్రభాస్ ప్లాప్ సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. సహజంగానే ప్రభాస్ పై ఈర్ష్య, ద్వేషం ఉంటాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ ఫెయిల్ కావడంతో ప్రభాస్ ని ఆడేసుకున్నారు. 
 

prabhas

ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ ఆత్రేయ పలుమార్లు పరోక్షంగా ప్రభాస్ ని టార్గెట్ చేశాడు. రాముడిగా జనాలు ఎవరిని పడితే వాళ్ళను అంగీకరించరు అంటూ విమర్శలు గుప్పించాడు. బాలీవుడ్ విమర్శలకు చెక్ పెడుతూ కల్కి 25829 AD తో ప్రభాస్ భారీ విజయం సాధించాడు. నార్త్ లో సైతం కల్కి సత్తా చాటింది. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

Prabhas

అయితే కల్కి చిత్రాన్ని కూడా బాలీవుడ్ టార్గెట్ చేసింది. నటుడు అర్షద్ వార్షి వివాదాస్పద కామెంట్స్ చేశాడు. కల్కి మూవీలో ప్రభాస్ నాకు జోకర్ లో అనిపించాడు. ఆ సినిమా నాకు నచ్చలేదు. హాలీవుడ్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ లో ఊహించుకున్నాను. కానీ కల్కి నిరాశపరిచింది, అని అన్నాడు.

kalki in amazon prime


అర్షద్ వార్షి మ్యాడ్ మ్యాక్స్ మూవీ ప్రస్తావన తేవడం వెనుక ఓ కారణం ఉంది.  కల్కి మూవీ కాన్సెప్ట్, కొన్ని సీన్స్ మ్యాడ్ మ్యాక్స్ ని గుర్తు చేస్తాయి. పరోక్షంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మ్యాడ్ మ్యాక్స్ ని కాపీ చేశాడని అర్షద్ వార్షి ఎద్దేవా చేశాడు. ఏది ఏమైనా ఓ బ్లాక్ బస్టర్ మూవీపై అర్షద్ వార్షి కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. 

Latest Videos

click me!