సెట్ లో డైరెక్టర్ చేసిన పనికి బోరున ఏడ్చేసిన ఇంద్రజ... వాంతులు అవుతాయని అన్నందుకు రివేంజ్!

First Published | Aug 19, 2024, 8:46 PM IST

హీరోయిన్ ఇంద్రజకు ఓ డైరెక్టర్ చుక్కలు చూపించాడట. సెట్ లో ఆయన చేసిన పనికి బోరున ఏడ్చేసిందట. అసలు ఏం జరిగిందో చూద్దాం... 
 

Indraja


కెరీర్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసింది ఇంద్రజ. యమలీల చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్. నిజానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల చిత్రంలో హీరోయిన్ గా సౌందర్యను అనుకున్నారు. హీరోయిన్ గా ఎదుగుతున్న దశలో ఉన్న సౌందర్య కమెడియన్ ఆలీతో జతకట్టేందుకు నిరాకరించింది. 
 

Indraja

దాంతో కొత్తమ్మాయి ఇంద్రజకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. యమలీల అనంతరం ఇంద్రజకు బ్రేక్ ఇచ్చిన చిత్రం అమ్మదొంగా. కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఇంద్రజ, ఆమనీ, సౌందర్య హీరోయిన్స్ గా నటించారు. అమ్మ దొంగా సైతం హిట్ కావడంతో ఇంద్రజకు ఆఫర్స్ పెరిగాయి. అమ్మదొంగా చిత్రానికి సాగర్ దర్శకుడు. 
 


Indraja


కాగా ఇంద్రజ చేసిన పనికి హర్ట్ అయిన సాగర్ సెట్స్ లో ఆమెకు చుక్కలు చూపించాడట. అమ్మదొంగా అనంతరం కృష్ణ-సాగర్ కాంబోలో జగదేక వీరుడు టైటిల్ తో ఓ చిత్రం వచ్చింది. ఈ మూవీలో ఇంద్రజకు దర్శకుడు సాగర్ మరో ఛాన్స్ ఇచ్చాడట. సీనియర్ నటి కే ఆర్ విజయ అత్యంత ధనవంతురాలట. ఆమెకు నిర్మాత ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను అన్నాడట. అవసరం లేదు నేను ట్రైన్ లో వస్తానని ఆమె అన్నారట. 
 

Indraja

ఇంద్రజ మాత్రం ఫ్లైట్ బుక్ చేయాల్సిందే అన్నారట. నాకు ట్రైన్ లో జర్నీ చేస్తే వాంతులు అవుతాయి. కాబట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని డిమాండ్ చేసిందట. ఈ విషయం తెలిసిన డైరెక్టర్ సాగర్.. ఓకే ఆమెను సెట్స్ కి రానీయండి. కానీ ఎవ్వరూ ఇంద్రజతో మాట్లాడటానికి వీల్లేదని సూచన చేశాడట. నాలుగైదు రోజుల షూటింగ్ తర్వాత డైరెక్టర్ సాగర్ వద్దకు వచ్చి ఇంద్రజ బోరున ఏడ్చేసిందట. 
 

Director Sagar

అప్పుడు డైరెక్టర్ సాగర్...ఎక్కడో కింది స్థాయిలో ఉన్న నిన్ను పైకి తీసుకొచ్చాము. నువ్వు ఆ స్థాయిని కాపాడుకోవాలి.అది నీ కెరీర్ కి మంచిది, అని ఇంద్రజతో అన్నాడట. జగదేకవీరుడు సినిమా అనంతరం సాగర్ హీరోయిన్ ఇంద్రజతో పని చేయలేదట. 
 

Indraja

ప్రస్తుతం ఇంద్రజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. అలాగే బుల్లితెర జడ్జిగా సందడి చేస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. అలాగే పలు టెలివిజన్ స్పెషల్ షోలలో సందడి చేస్తుంది. రోజా అనంతరం బుల్లితెరపై ఇంద్రజ ఆ స్థాయిలో సక్సెస్ అయ్యింది.
 

Latest Videos

click me!