`రామయ్యా వస్తావయ్యా` కంటే ముందే ఎన్టీఆర్‌తో హరీష్‌ శంకర్‌ సినిమా.. ఎలా మిస్‌ అయ్యిందంటే?

Published : Aug 19, 2024, 06:21 PM ISTUpdated : Aug 19, 2024, 06:23 PM IST

ఎన్టీఆర్, హరీష్‌ శంకర్ కాంబినేషన్‌లో `రామయ్యా వస్తావయ్యా` సినిమా వచ్చి పరాజయం చెందింది. కానీ అంతకంటే ముందే మరో సినిమా చేయాల్సిందట. అదేంటనేది చూస్తే..  

PREV
15
`రామయ్యా వస్తావయ్యా` కంటే ముందే ఎన్టీఆర్‌తో హరీష్‌ శంకర్‌ సినిమా.. ఎలా మిస్‌ అయ్యిందంటే?

ఎన్టీఆర్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో `రామయ్యా వస్తావయ్యా` సినిమా వచ్చింది. 2013లో రిలీజ్‌ అయిన ఈ మూవీ ఆడియెన్స్ ని అలరించలేకపోయింది. సమంత, శృతి హాసన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తీవ్ర నిరాశ పరిచింది. అయితే ఆ తర్వాత తారక్‌కి మంచి హిట్‌ ఇస్తానని చెప్పాడు హరీష్‌. పలు ఈవెంట్లలో వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు ఆ కాంబినేషన్‌ సెట్‌ కాలేదు. 
 

25

తాజాగా ఇదే ప్రశ్న ఇప్పుడు హరీష్‌ శంకర్‌కి ఎదురయ్యింది. ఆయన రవితేజ హీరోగా `మిస్టర్‌ బచ్చన్‌` సినిమాని రూపొందించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ మూవీ విడుదలైంది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఈ నేపథ్యంలో సినిమాని మరింతగా పుష్‌ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా హరీష్‌ శంకర్‌ ఫ్యాన్స్ తో ఛాటింగ్‌ రైడ్‌ కార్యక్రమం పెట్టుకున్నారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 
 

35

అందులో భాగంగా ఎన్టీఆర్‌తో సినిమా ప్రస్తావన వచ్చింది. ఆయనతో సినిమా ఎప్పుడు ఉంటుందనే ప్రశ్న ఎదురయ్యింది. ఇప్పటికిప్పుడు స్క్రిప్ట్ రెడీ లేదని, కూర్చొని రాయాలని, ఆయన రేంజ్‌కి తగ్గ స్క్రిప్ట్ రాయాలని తెలిపారు హరీష్‌ శంకర్‌. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌ నెక్ట్స్ సినిమాల లైనప్‌ చాలా పెద్దగా ఉందని, ఇప్పటికిప్పుడు ఆయన్ని కలవడం కుదరదని, ఇప్పట్లో సినిమా కష్టమే అని తెగేసి చెప్పాడు హరీష్‌ శంకర్‌. 
 

45

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమా గురించి బయటపెట్టారు. తన రెండో సినిమా ఎన్టీఆర్‌తోనే చేయాల్సిందన్నారు. `షాక్‌`తో హరీష్‌ శంకర్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కానీ ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. అనంతరం ఏ పెద్ద హీరో హరీష్‌తో సినిమాలు చేయడానికి ఒప్పుకోరు. కానీ ఎన్టీఆర్‌ ఒప్పుకున్నాడట. సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. `ఎమ్మెల్యే`(మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే కథని ఎన్టీఆర్‌ ఓకే చేశాడట. దానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ కూడా తనవద్ద ఉన్నాయని చెప్పాడు హరీష్‌.
 

55

``షాక్‌` ఫ్లాప్‌ అయ్యిందనేది చూడలేదు, నా కథని నమ్మి ఎన్టీఆర్‌ ఓకే చేశాడు. ఓ ఫెయిల్యూర్‌ దర్శకుడిగా `షాక్‌` తర్వాత నాతో సినిమా చేస్తానని చెప్పిన ఫస్ట్ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌. అందుకే నా మనసులో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎప్పటికీ తారక్‌ నాకు స్పెషలే` అని వెల్లడించారు హరీష్‌ శంకర్‌. అయితే ఆ మూవీ కొన్ని కారణాలతో వర్కౌట్‌ కాలేదని చెప్పారు హరీష్‌. ప్రస్తుతం ఎన్టీఆర్‌ `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్ చూశానని, అదిరిపోయిందని, ఆయన సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నానని చెప్పారు హరీష్‌ శంకర్‌. `దేవర` వచ్చే నెల 27న విడుదల కాబోతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories