మహేష్‌ బాబు అన్న కొడుకు హీరోగా ఎంట్రీ.. హాలీవుడ్‌ కటౌట్‌ని తలపిస్తున్న రమేష్‌బాబు తనయుడు.. సినిమా ఎప్పుడంటే?

First Published | Aug 19, 2024, 8:12 PM IST

సూపర్‌ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో ఇప్పటికే మహేష్‌ బాబు, సుధీర్‌ బాబు, గల్లా అశోక్‌ హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు మరో హీరో రాబోతున్నాడు. క్రేజీ డిటెయిల్స్ బయటకు వచ్చాయి. 
 

సూపర్ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. కృష్ణ పెద్ద కొడుకు, మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా ఆ అప్‌డేట్‌ వచ్చింది. హీరోగా ఎంట్రీకి సంబంధించిన వివరాలు వెల్లడించింది టీమ్‌.  ఈ మేరకు లేటెస్ట్ ఫోటో షూట్‌ చేయగా జయకృష్ణ ఘట్టమనేని కటౌట్‌ అదిరిపోయేలా ఉంది. చూడ్డానికి హాలీవుడ్‌ హీరోని తలపిస్తుండం విశేషం. 

ఇక రమేష్‌ బాబు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే జయకృష్ణ అందరిని చూపుని ఆకర్షించాడు. ఇటీవల నాన్న జయంతి, కృష్ణ వర్థంతి, జయంతి వేడుకల్లో, ఫ్యామిలీ ఫంక్షన్లలో జయకృష్ణ మెరిశారు. ఇందులో భారీ కటౌట్ తో అందరి చూపులను ఆకర్షించాడు. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడనే వార్తలు వైరల్‌ అయ్యాయి. 
 


తాత ఆధిశేషగిరి రావు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్ట్ లో జయకృష్ణ హైదరాబాద్‌ రాబోతున్నాడని, సినిమాలు చేయబోతున్నాడని తెలిపారు. అన్నట్టుగానే ఆయన సినిమా ఎంట్రీ ఇస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఫోటో షూట్‌ చేశాడు జయకృష్ణ. దీని ద్వారా మేకర్స్ కి హింట్‌ ఇచ్చాడు. మంచి స్క్రిప్ట్ లతో తన వద్దకు రావచ్చనే సందేశాన్నిస్తున్నాడు. 
 

ఇక జయకృష్ణ అమెరికాలో యాక్టింగ్‌ కోర్స్ చేశాడు. వెండితెరపై మెప్పించేందుకు సంబంధించిన యాక్టింగ్‌ మెలకులను నేర్చుకున్నాడు. అదే సమయంలో ఫిల్మ్ మేకింగ్‌కి సంబంధించిన విషయాలపై కూడా ట్రైన్‌ అయ్యాడు జయకృష్ణ. ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని ఇప్పుడు ఇక సినిమాల్లో నటించేందుకు వచ్చాడు. హీరోగా కనిపించేందుకు అన్ని విధాలుగా రెడీ అయ్యాడు జయకృష్ణ. బాడీ లాంగ్వేజ్‌, ఫిట్‌నెస్‌ పరంగానూ పర్‌ఫెక్ట్ గా రెడీ అయినట్టు లేటెస్ట్ గా ఫోటో షూట్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడి ఎంట్రీ త్వరలోనే ఉండబోతుందని చెప్పొచ్చు. 
 

ప్రస్తుతం స్క్రిప్ట్ ల అన్వేషణ జరుగుతుందని, మంచి బ్యానర్స్ లో మంచి దర్శకులతో పనిచేయాలని, మంచి కథలతో ఆడియెన్స్ ముందుకు రావాలని చూస్తున్నాడు. సినిమా ఫైనల్‌ అయ్యాక ఆ విషయాలను వెల్లడిస్తామని తెలిపాడు టీమ్‌. వీలైనంత త్వరగానే జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఉండనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
 

ఇప్పటికే సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ నుంచి మహేష్‌ బాబు, సుధీర్‌ బాబు, మంజుల, ఆమె భర్త నటులుగా రాణిస్తున్నారు. అలాగే గల్లా అశోక్‌ కూడా హీరోగా చేస్తున్నాడు. మరి జయకృష్ణ.. తాత కృష్ణ, బాబాయ్ మహేష్‌ బాబు రేంజ్‌లో పేరు తెచ్చుకుంటాడా? అనేది చూడాలి. అదే సమయంలో ఇప్పుడు రాబోతున్న వారసులకు జయకృష్ణ పోటీ ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు. 

Latest Videos

click me!