#Pushpa-2 లో ప్రభాస్ హీరోయిన్ స్పెషల్ సాంగ్

First Published | Oct 21, 2024, 11:07 AM IST

అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.650 కోట్లుగా ఉంది. చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో శ్రద్ధా కపూర్ నటిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

అల్లు అర్జున్‌, సుకుమార్‌ క్రేజీ కాంబోలో రూపొందుతున్న చిత్రం పుష్ప-2 దిరూల్‌. గతంలో ఈ కలయికలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ సినిమా పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  

pushpa 2

గంధపు చెక్కల స్మగ్లింగ్, అమ్మ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.  అలాగే రూ.370 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది.   అయితే పుష్ప మొదటి భాగంలో  స్టార్  హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఈ సాంగ్ సినిమా కలెక్షన్స్ పై  ప్రభావం చూపిందని చెప్పవచ్చు. దీంతో పుష్ప సెకెండ్ పార్ట్ లోని స్పెషల్ సాంగ్ పై ఆసక్తి నెలకొంది. ఈ  సాంగ్ లో ఎవరు చేయబోతన్నారనే వార్త అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఓ వార్త బయిటకు వచ్చింది.


బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శ్రద్దా కపూర్ పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. శ్రద్దా కపూర్ గతంలో ప్రబాస్ చిత్రం సాహో లో హీరోయిన్ గా చేసింది.  ఈ వార్త నిజమయితే నార్త్ లో పుష్ప 2 కి మంచి హైప్ వస్తుందని అలాగే కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంటుందనేది నిజం. అయితే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ అయితే ఏమీ లేదు. 
 


గతంలో కూడా ప్రముఖ మోడల్ మరియు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని గతంలో పలు గాసిప్స్ వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ కొట్టిపారేశారు. అయితే పుష్ప : 2 ది రూల్ డిసెంబర్ 06న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ కి ముందే పుష్ప 2 చిత్రం దాదాపుగా రూ.650 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

పుష్ప చిత్రం నార్త్ ఇండియాలో సినిమా బ్లాక్‌బస్టర్ కావడం వల్ల  సుకుమార్ పై భారం ఎక్కువే పడిందని చెప్పాలి. దాంతో  ‘పుష్ప-2’కు కూడా బాగా హైప్ వచ్చింది. బిజినెస్ అలాగే జరిగింది. ఈ క్రమంలో   ఈ సినిమా మేకింగ్ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

సుకుమార్ క్వాలిటీ విషయంలో రాజీ పడడని అందరికీ తెలుసు. స్క్రిప్టు తయారీ దగ్గర్నుంచి చాలా టైం తీసుకునే చేస్తారు. లెక్కలేనన్ని వెర్షన్లు రాయిస్తాడు. ఎక్కడిక్కడ ఫిక్స్ కాకుండా నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. ఆఖరి క్షణం వరకూ  సీన్, డైలాగులు మారుస్తాడని  చెప్తారు.   అయితేనేం అవుట్ ఫుట్ అదిరిపోతుంది. అదే కదా ప్రేక్షకులకు కావాల్సింది. 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


 
కొన్ని ప్రాంతాలలో, పుష్ప 2 హక్కుల కోసం ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ రేసులో ఉన్నారు. వచ్చే నెలలో డీల్స్‌ను ఖరారు చేయనున్నారు మేకర్స్. డిమాండ్‌ కారణంగా డిస్ట్రిబ్యూటర్‌లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ స్దాయి డిమాండ్ కు మరో కారణం కూడా ఉంది.

 రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్  క్రిస్మస్ నుండి సంక్రాంతికి మార్చబడటం మరో పెద్ద కారణం. పుష్ప 2: క్రిస్మస్ ,న్యూ ఇయిర్ వీకెండ్స్ లో మంచి పనితీరును కనబరచడానికి  అవకాశం ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్  సినిమాపై బాగా నమ్మకంగా ఉన్నారు.

Latest Videos

click me!