Chiranjeevi - Balakrishna
నందమూరి-కొణిదెల కుటుంబాలు టాలీవుడ్ ని దశాబ్దాలుగా శాసిస్తున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాన్ రైవల్రీ ఉంది. ఫ్యాన్స్ కత్తులు దూసుకుంటారు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి చిత్రాలు చేశారు. ఆయన చిత్రాల్లో సపోర్టింగ్, సెకండ్ హీరో పాత్రల్లో కనిపించారు.
Chiranjeevi - Balakrishna
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవి తిరుగులేని స్టార్ గా ఎదిగారు. టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ కైవశం చేసుకున్నాడు. మరోవైపు బాలకృష్ణ సైతం టాప్ స్టార్స్ లో ఒకరిగా నిలదొక్కుకున్నారు. చిరంజీవి-బాలకృష్ణ కలిసి నటించలేదు. వాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇష్టపడలేదు. ఫ్యాన్స్ మనోభావాలు కూడా ఇందుకు కారణం.
ఇక బాలకృష్ణ-చిరంజీవి చాలా అరుదుగా కలుస్తారు. సందర్భం ఉంటే తప్పితే కలుసుకోవడానికి ఇష్టపడరు. అందుకు ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడమే కారణం అనే ఓ వాదన ఉంది. ఈ ప్రశ్నకు బాలకృష్ణ ఒక సందర్భంలో సమాధానం చెప్పాడు. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మేము చాలా బిజీగా ఉంటాము. ఏదైన ఈవెంట్స్ లో మాత్రమే కలిసే అవకాశం దొరుకుతుంది. రామ్ చరణ్ సైతం కెరీర్లో ఎదగాలని నేను కోరుకుంటాను.. అన్నారు.
Chiranjeevi - Balakrishna
ఇటీవల బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుక జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరైన సంగతి తెలిసిందే. 50 ఏళ్ల బాలకృష్ణ ప్రస్థానాన్ని చిరంజీవి వేదిక మీద కొనియాడారు. అయితే ఇదంతా మారిన రాజకీయ సమీకరణాల వలనే సాధ్యమైందనే వాదన లేకపోలేదు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. అందుకు పవన్ కళ్యాణ్.. నారా చంద్రబాబు, బాలకృష్ణతో కలిసి కృషి చేశాడు. జనసేన పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా టీడీపీకి పరోక్షంగా చిరంజీవి ప్రయోజనం చేకూర్చారు. నందమూరి-కొణిదెల కుటుంబాలు బాగా దగ్గరయ్యాయి. అందుకే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు బాలకృష్ణ హాజరయ్యాడనే ప్రచారం జరిగింది.
Chiranjeevi - Balakrishna
కాగా 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి బయటకు వచ్చిన జనసేన విడిగా పోటీ చేసింది. ఈ ఎన్నికలకు ముందు బాలకృష్ణను నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో బాలకృష్ణ చిరంజీవి రాజకీయ వైఫల్యాన్ని ఉద్దేశిస్తూ ఘాటైన విమర్శలు చేశాడు. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నారు. వరుస వీడియోలతో బాలకృష్ణను నాగబాబు ట్రోల్ చేశాడు.
అలాగే కోవిడ్ సమయంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు చిరంజీవి నివాసంలో భేటీ కావడాన్ని బాలకృష్ణ తప్పుబట్టారు. మమ్మల్ని ఎందుకు పిలవలేదు. అందరూ కూర్చుని భూములు పంచుకుంటున్నారా? అని బాలకృష్ణ విమర్శలు చేశారు. బాలయ్య విమర్శలపై నాగబాబు స్పందించారు. ఇండస్ట్రీలో నువ్వు కూడా ఒక హీరోవి. నువ్వే ఇండస్ట్రీ కాదని బాలయ్య మీద ఫైర్ అయ్యారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్-ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప పరిణామం. ఫ్యాన్ రైవల్రి ఆర్ ఆర్ ఆర్ వలన తగ్గుతుంది అనుకుంటే ఎక్కువైంది. మూవీ విడుదల తర్వాత సోషల్ మీడియాలో జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. హీరోల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వార్స్ కి తెగబడుతున్నారు.