సమంతకి రోజూ అదే పని, ఆ హీరో గురించి అల్లు అర్జున్ తో డిస్కషన్.. ఓపెన్ గా బయటపెట్టాడుగా..

First Published | Oct 21, 2024, 10:47 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ పుష్ప 2లో నటిస్తున్నారు. రోజు రోజుకి పుష్ప 2 హీట్ పెరుగుతోంది. ఆల్రెడీ దేవర చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రచ్చ చేసింది. త్వరలో పుష్ప 2 సందడి మొదలు కాబోతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ పుష్ప 2లో నటిస్తున్నారు. రోజు రోజుకి పుష్ప 2 హీట్ పెరుగుతోంది. ఆల్రెడీ దేవర చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రచ్చ చేసింది. త్వరలో పుష్ప 2 సందడి మొదలు కాబోతోంది. దీనితో పుష్ప 2 విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాల్గవ చిత్రం తెరకెక్కనుంది. 

ఆల్రెడీ వీళ్లిద్దరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలు వచ్చాయి. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్, సమంత జంటగా నటించారు. అయితే సన్నాఫ్ సత్యమూర్తి మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు సమంత ఎలా ఉండేది అని అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 


బన్నీ మాట్లాడుతూ.. సెట్స్ లో ఖాళీ టైం దొరికితే ప్రతి రోజు సమంత నాతో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది. ఆయన్ని పోగొడుతూ అనేక విషయాలు చెప్పేది. సమంతకి కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన్ని బాగా గౌరవిస్తుంది. అత్తారింటికి దారేది సినిమా విశేషాలు చెప్పేది. సమంత రేడియో లాగా.. ఎప్పుడూ సైలెంట్ గా ఉండదు అంటూ అల్లు అర్జున్ ఫన్నీగా కామెంట్స్ చేశారు. 

అల్లు అర్జున్.. అత్తారింటికి దారేది చిత్రం గురించి మాట్లాడుతూ ఆ చిత్రాన్ని ఆ టైటిల్ పర్ఫెక్ట్. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి తగ్గ టైటిల్ కాదని చాలా మంది అన్నారు. కానీ కథకి ఆ టైటిల్ పర్ఫెక్ట్. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రానికి కూడా అదే కరెక్ట్ టైటిల్. త్రివిక్రమ్ గారు హీరోల ఇమేజ్ గురించి పట్టించుకోరు అని అల్లు అర్జున్ తెలిపారు. 

ఈ చిత్రానికి క్యాప్షన్ ఉంటే బావుంటుంది.. ఇంగ్లీష్ క్యాప్షన్ పెడదాం అని చాలా మంది చెప్పారు. కానీ త్రివిక్రమ్ ఇంగ్లీష్ లో వద్దని కాస్త ఆలోచించారు.. సన్నాఫ్ సత్యమూర్తి విలువలే ఆస్తి అంటూ అదిరిపోయే క్యాప్షన్ పెట్టేశారు. ఆ విధంగా అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి విశేషాలు గుర్తు చేసుకున్నారు. 

Latest Videos

click me!