Chiranjeevi
చిరంజీవి దేశవ్యాప్తంగా ఫేమ్ ఉన్న హీరో. ముఖ్యంగా సౌత్ ఇండియాలో అన్ని పరిశ్రమల్లో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. వివిధ భాషలకు చెందిన స్టార్ హీరోలతో పరిచయాలు ఉన్నాయి. ఆయన కోరితే కాదనే నటుడు ఉండరు. అలాంటిది ఒక నటుడు చిరంజీవి ఆఫర్ ని రెండుసార్లు రిజెక్ట్ చేశాడు. ఆయన ఎవరో కాదు పృథ్విరాజ్ సుకుమారన్. ఈ మలయాళ నటుడు మల్టీ టాలెంటెడ్. గొప్ప గొప్ప చిత్రాల్లో నటించాడు.
మలయాళంలో హీరోగా చేస్తూనే ఇతర భాషల్లో విలన్, ఇతర కీలక రోల్స్ లో నటిస్తున్నాడు. పృథ్విరాజ్ ని చిరంజీవి రెండు సందర్భాల్లో సంప్రదించాడు. మొదటిసారి సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం కాంటాక్ట్ చేశాడు. పృథ్విరాజ్ తనకు ఉన్న కమిట్మెంట్స్ రీత్యా సైరా నరసింహారెడ్డి ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు.
అలాగే చిరంజీవి మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ తెలుగు హక్కులు కొనుగోలు చేశాడు. లూసిఫర్ చిత్రానికి పృథ్విరాజ్ దర్శకుడు. మోహన్ లాల్, తోవినో, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలు చేశారు. రీమేక్ గాడ్ ఫాదర్ కి సైతం దర్శకత్వం వహించాలని పృథ్విరాజ్ ని చిరంజీవి సంప్రదించాడు. ఈ ఆఫర్ ని కూడా పృథ్విరాజ్ తిరస్కరించారు. దాంతో చేసేది లేక మోహన్ రాజాతో తెరకెక్కించారు.
Mahesh Babu and Rajamouli
చిరంజీవిని రెండుసార్లు తిరస్కరించిన పృథ్విరాజ్... మహేష్ బాబు చిత్రానికి ఎస్ చెప్పాడంటూ ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మహేష్-రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబి 29 చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం పృథ్విరాజ్ సుకుమార్ ని ఎంపిక చేశారట. ఈ చిత్రానికి పృథ్విరాజ్ సైన్ చేశాడని అంటున్నారు.
పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనున్న రాజమౌళి మూవీ కావడంతో మారు మాట్లాడకుండా పృథ్విరాజ్ అంగీకారం తెలిపారని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియదు. కారణం ఎలాంటి అధికారిక సమాచారం. ఎస్ఎస్ఎంబి 29 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. జంగిల్ అడ్వెంచర్ డ్రామా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు..