ఇక ప్రభాస్ పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. ప్రముఖంగా వినిపించింది మాత్రం అనుష్క శెట్టి పేరు. వీరిద్దరి కాంబోలో ఏకంగా నాలుగు చిత్రాలు వచ్చాయి. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో ప్రభాస్-అనుష్క శెట్టి కలిసి నటించారు. పెళ్లి చేసుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ ని వారు కొట్టిపారేశారు.