మహేష్ 28 చిత్రాలు చేస్తే, రాజమౌళికి నచ్చినవి ఆ రెండే! కారణం ఏమిటో తెలుసా?

First Published | Oct 27, 2024, 7:56 AM IST

మహేష్ బాబు హీరోగా ఇరవైకి పైగా సినిమాలు చేశారు. అయితే అందులో రాజమౌళికి నచ్చినవి రెండేనట. ఆ చిత్రాలు ఏమిటో? అందుకు కారణం ఏమిటో? తెలుసా... 
 

చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ బాబు నట ప్రస్థానం మొదలైంది. బాల్యం నుండే మహేష్ బాబును కృష్ణ నటుడిగా ప్రోత్సహించాడు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే ఒకటి రెండు సినిమాలు మహేష్ తో ప్లాన్ చేసేవాడట. చైల్డ్ ఆర్టిస్ట్ గా డ్యూయల్ రోల్, మల్టీస్టారర్స్ చేసిన అరుదైన నటుడు మహేష్ బాబు.

ఇక 1999లో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజకుమారుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన రాజకుమారుడు సూపర్ హిట్. మహేష్ బాబు ఎనర్జీ, యాక్టింగ్ మెప్పిస్తాయి. రాజకుమారుడు చిత్రంలోని సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. మణిశర్మ సంగీతం అందించారు. 

ఇక మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలు ఇష్టపడతారు. ఓవర్సీస్ లో మహేష్ సినిమాలకు భారీ మార్కెట్ ఉంది. 


Mahesh Babu

కాగా మహేష్ బాబు నెక్స్ట్ దర్శకుడు రాజమౌళితో మూవీ చేస్తున్నాడు. ఇది అరుదైన కాంబినేషన్. కారణం ఇంత వరకు రాజమౌళి, మహేష్ బాబు కలిసి మూవీ చేసింది లేదు. బాహుబలి కంటే ముందే మహేష్ బాబుతో రాజమౌళి మూవీ చేయాల్సిందట. అనుకోని కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ తో  ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. 

వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ ఎస్ఎస్ఎంబి 29కి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. AI(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ని ఈ చిత్రం కోసం వాడనున్నారట. ఈ క్రమంలో రాజమౌళి దానిపై అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని ఇప్పటికే ప్రకటించారు. జనవరి నుండి షూటింగ్ మొదలు కానుందని సమాచారం. 

Mahesh Babu and Rajamouli

ఇక తన ప్రతి సినిమా ఆరంభానికి ముందు రాజమౌళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమం ఎప్పుడు ఉంటుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి మహేష్ బాబు, రాజమౌళి ప్రెస్ ముందుకు రానున్నారట. సినిమాకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించనున్నారట. పాన్ వరల్డ్ మూవీగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఎస్ఎస్ఎంబి 29 రాజమౌళి రూపొందించనున్నారు. 

ఇక మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. అలాగే గతంలో మహేష్ ని ఉద్దేశించి రాజమౌళి మాట్లాడిన సందర్భాలు కూడా తక్కువే. కాగా మహేష్ హీరోగా ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో రాజమౌళి రెండు చిత్రాలు అంటే చాలా ఇష్టం అట. అవి ఒకటి ఒక్కడు కాగా, పోకిరి రెండో చిత్రం. ఈ రెండు చిత్రాలంటే రాజమౌళికి చాలా ఇష్టం అట. 

Mahesh Babu

అందుకు కారణం.. ఒక్కడు, పోకిరి చిత్రాల్లో మహేష్ బాబు సరికొత్తగా ఉంటారు. నటన అద్భుతంగా ఉంటుంది. మహేష్ బాబు ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడు, అని రాజమౌళి కొనియాడారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఒక్కడు మహేష్ కి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి. ఆ మూవీ మహేష్ కి భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కి, హైదరాబాద్ యువకుడికి మధ్య సాగే సంఘర్షణ ఆకట్టుకుంటుంది. 

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?

Mahesh Babu

పోకిరి మూవీలో మహేష్ బాబును భిన్నంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలెట్. పోకిరి సైతం టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్. పూరి జగన్నాధ్ వన్ లైనర్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంటాయి. అదన్నమాట మేటర్.. 

Latest Videos

click me!