ఇప్పటి నుంచి అయినా విష్ణు ప్రియా కాస్త జాగ్రత్తగా ఉంటుందేమో చూడాలి. చీఫ్ గా ఆమె సక్సెస్ అవుతుదా లేదా అనేది కూడా చూడాలి.ఇక బెస్ట్ ఎంటర్టైనర్ గా అవినాష్ కు అభినందనలు అందాయి. సరదాగా ఆటపట్టించారు కూడా. ఇక మెహబూబ్, గౌతమ్ ఆటతీరుకు కూడా ప్రశంసలు దక్కాయి. తేజాను అభినందిస్తూనే క్లాస్ కూడా పీకారు నాగార్జున. ఇక ఈఎపిసోడ్ లో ఎవరినీ సేవ్ చేయలేదు నాగ్.. సండే ఫన్ డే ఎపిసోడ్ మెగా ఎపిసోడ్ గా రాబోతోంది.
దివాళి స్పెషల్ ఎపిసోడ్ లో ఒకేసారి సేవ్ చేసి.. ఎలిమినేషన్ నడిపించే అవకాశం కనిపిస్తోంది.. ఇక శనివారం ఎపిసోడ్ లో సూర్య స్పెషల్ గా కంగువా టీమ్ రావడం సందడిగామారింది. సూర్యకు తమ డాన్స్ పర్ఫామెన్స్ లతో సర్ ప్రైజ్ ఇచ్చారు.. దాంతో ఆయన ఫిదా అయిపోయారు. ఇక హౌస్ లో ఉన్నవారితో ప్రేమగా మాట్లాడారు సూర్య.