బాలయ్య బాబాయ్‌తో కాదు, ఆయనతోనే సినిమా చేస్తా.. ఎన్టీఆర్‌ బోల్డ్ రియాక్షన్‌

Published : Oct 26, 2024, 11:28 PM IST

ఎన్టీఆర్‌ తన బాబాయ్‌ గురించి షాకింగ్‌ కామెంట్‌ చేశారు. బాలయ్య బాబాయ్‌తో సినిమా చేయనని తెగేసి చెప్పాడు. అదే సమయంలో తాను ఎవరితో చేస్తానో చెప్పి షాకిచ్చాడు.   

PREV
15
బాలయ్య బాబాయ్‌తో కాదు, ఆయనతోనే సినిమా చేస్తా.. ఎన్టీఆర్‌ బోల్డ్ రియాక్షన్‌
JNTR

ఎన్టీఆర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్`తో పాన్‌ ఇండియా హీరోగా ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన ఇటీవల `దేవర`తో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. ఈ సినిమా భారీస్థాయిలోనే విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సుమారు ఐదు వందల కోట్ల వరకు కలెక్షన్లని సాధించిందని సమాచారం. దీంతో తన పాన్‌ ఇండియా ఇమేజ్‌ని పదిలం చేసుకున్నారు తారక్‌. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

25

ఇక ఎన్టీఆర్‌ ఏదైనా బోల్డ్ గా చెబుతారు. ఫేస్‌ టూ ఫేస్‌ ఉంటారు. ఎదుటి వాళ్లు ఏమనుకుంటారనేది కాదు, తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. ఈ క్రమంలో కొన్ని చిక్కుల్లో పడే సంఘటనలు ఉన్నా, తాను అనుకున్నదే చేస్తారు. అయితే ఎన్టీఆర్‌ చెప్పిన ఓ సమాధానం  బాలయ్య ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పినదానికి మాత్రం అంతా వాహ్‌ అంటారు. ఇటీవల కాలంలో బాలకృష్ణ కి, ఎన్టీఆర్‌ కి మధ్య గ్యాప్‌ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది.

35

బాలయ్యతో సినిమా చేయడానికి నో చెప్పారు. అదే సమయంలో తాను నాన్న హరికృష్ణతోనే సినిమా చేస్తానని తెలిపారు. మరి ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరమేంటి? ఏం జరిగిందనేది చూస్తే తారక్‌.. జయప్రద హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయప్రదం అనే టాక్‌ షోకి వెళ్లాడు తారక్‌. ఇందులో ఓ ఇంట్రెస్టింగ్‌ ప్రశ్న అడిగింది జయప్రద. ఓకేసారి సినిమా చేయాల్సి వస్తే, మీరు ఎవరతో సినిమా చేస్తారు? ఆప్షన్స్ గా బాలకృష్ణ, హరికృష్ణ పేర్లు చెప్పారు. దీంతో ఎన్టీఆర్‌ తడుముకోకుండా సింపుల్‌గా ఆన్సర్‌ ఇచ్చేశాడు. బాలయ్య బాబాయ్‌తో కాదు, నాన్న హరికృష్ణతోనే సినిమా చేస్తానని తెలిపారు. ఎంతైనా సొంత నాన్న కదా అంటూ క్లారిటీ ఇవ్వడం విశేషం. 
 

45

`తారక్‌ చెప్పిన మాట బాలయ్య ఫ్యాన్స్ కి బాధ కలిగించినా, ఆయన సొంత నాన్నకి ప్రయారిటీ ఇచ్చాడనేది, తండ్రిపై తనకున్న ప్రేమని తెలియజేస్తుంది. ఇది కొన్నాళ్ల క్రితం నాటి ఇంటర్వ్యూ. ఆ సమయంలో హరికృష్ణ సినిమాలు చేస్తున్నారు. అందుకే తారక్‌  సమాధానం చెప్పాడని అర్థమవుతుంది. కానీ హరికృష్ణ ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద కొడుకు జానకీ రామ్‌ కూడా అలాన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హరికృష్ణ కూడా అలానే మరణించడం విచారకరం. 
 

55

`దేవర`తో హిట్‌ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ తో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. దీంతోపాటు హిందీలో `వార్‌ 2` సినిమాలోనూ నటిస్తున్నారు. అందులో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు. ఇది భారీ స్థాయిలో ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్‌ రోల్‌ నెగటివ్‌ షేడ్‌ లో ఉంటుందని సమాచారం. దీంతోపాటు `దేవర 2` చేయాల్సి ఉంది ఎన్టీఆర్‌. అయితే దీనికి కొంత టైమ్‌ పట్టే ఛాన్స్ ఉంది. 

read more: తెలంగాణలో బాలకృష్ణ ఇంటర్నేషనల్‌ స్టూడియో, ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. తెరవెనుక చక్రం తిప్పుతున్న సీఎం?

also read: ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌ని పోస్టర్‌పై చూసి ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా? తారక్‌ చెప్పిన మాటకి నిర్మాత షాక్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories