మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా రూపొందుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ ఆ తరహా ఫాంటసీ జోనర్ లో నటిస్తున్న చిత్రం ఇదే. ముల్లోకాలు చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Vishwambhara
అయితే ఈ చిత్రంలో వీరుడిగా నటించే చిరంజీవి ఏ లక్ష్యం కోసం పోరాడబోతున్నాడు, ఈ చిత్ర కథలోని కీలక అంశం ఏంటి అనేది ఇప్పటికి సస్పెన్స్. ఈ చిత్రంలో మల్టిపుల్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఏజ్ లెస్ బ్యూటీ త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరికొందరు హీరోయిన్లు ఈ చిత్రంలో భాగం అవుతున్నారు. ఊర్వశి రౌటేలా ఒక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో ఇద్దరి హీరోయిన్లు కూడా ఈ చిత్రం కోసం ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అంతగా సక్సెస్ లేని సురభి, ఇషా చావ్లా ఇప్పటికే విశ్వంభర సెట్స్ లో జాయిన్ అయ్యారట. వీళ్ళిద్దరూ ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నారు అనేది తెలియదు. సురభి ఒక్కక్షణం, బీరువా, ఓటర్ లాంటి చిత్రాల్లో నటించింది.
ఇక ఇషా చావ్లా ప్రేమ కావాలి చిత్రంతో హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత చిత్రాల్లో ఆమెకి సక్సెస్ దక్కలేదు. ఇషా చావ్లా గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. సురభి తాజా ఇంటర్వ్యూలో విశ్వంభర చిత్రంలో ఛాన్స్ రావడం గురించి ఓపెన్ అయింది.
చిరంజీవి సర్ పక్కన నటించే అవకాశం రావడంతో తాను థ్రిల్ ఫీల్ అయినట్లు సురభి పేర్కొంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది తనకు డ్రీమ్ లాంటి ఛాన్స్ అని పేర్కొంది. చిరంజీవి సర్ తనని అభినందించారని సురభి ఉప్పొంగిపోతోంది. గత చిత్రాల్లో ఆమె వర్క్ ని చిరంజీవి మెచ్చుకున్నారట. అంతే కాదు నటిగా తనని బహుముఖంగా ఉండమని సలహా ఇచ్చినట్లు కూడా సురభి పేర్కొంది.
ఈ క్రమంలో తన పాత్ర గురించి కూడా సురభి హింట్ ఇచ్చింది. ఈ చిత్రంలో తాను హాఫ్ శారీలో ట్రెడిషనల్ గా కనిపించబోతున్నట్లు పేర్కొంది. ఈ చిత్రంలో అత్యంత కీలక సన్నివేశాల్లో తన పాత్ర ఉండబోతున్నట్లు సురభి పేర్కొంది. సురభి కామెంట్స్ తో విశ్వంభరపై ఫ్యాన్స్ లో ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. ఇంకెంత మంది హీరోయిన్లు విశ్వంభరతో జతకడతారో చూడాలి.