రోజాకు అన్నగా, భర్తగా చేసిన ఏకైన హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించి ఉండరు!

Published : Feb 23, 2024, 09:36 AM ISTUpdated : Feb 23, 2024, 02:04 PM IST

సినిమా పరిశ్రమలో కాంబినేషన్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పటి మంత్రి, ఒకప్పటి హీరోయిన్ రోజా  అన్నయ్యతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ హీరో ఎవరో చూద్దాం...   

PREV
17
రోజాకు అన్నగా, భర్తగా చేసిన ఏకైన హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించి ఉండరు!
Roja Selvamani

ఎన్టీఆర్ కి మనవరాలుగా చేసిన శ్రీదేవి... ఆయన పక్కన హీరోయిన్ గా నటించింది. ఎన్టీఆర్-శ్రీదేవిలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అలాగే మీనా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా రజినీకాంత్ చిత్రంలో నటించింది. ముత్తులో ఆయనకు జంటగా చేసింది. ఇలాంటి కాంబినేషన్స్ చాలా అరుదుగా ఉంటాయి. 
 

27

మంత్రి రోజాకు ఓ విచిత్రమైన కాంబినేషన్ ఎదురైంది. ఆమె అన్నయ్యతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. ఓ చిత్రంలో సదరు హీరోకి చెల్లిగా నటించిన రోజా... తర్వాత భార్య పాత్రలు చేసింది. 

 

37

రోజా 90లలో స్టార్ గా వెలిగిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాలు చేసింది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లతో బ్లాక్ బస్టర్ చిత్రాలు చేసింది. 2000 వరకు ఆమె హీరోయిన్ గా చేయడం విశేషం. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. 

47
Roja Selvamani

కెరీర్ బిగినింగ్ లో రోజా నటించిన సూపర్ హిట్ మూవీ సీతారత్నం గారి అబ్బాయి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించగా వినోద్ కుమార్, రోజా జంటగా నటించారు. వాణిశ్రీ కీలక రోల్ చేశారు. ఈ మూవీలో శ్రీకాంత్...  రోజా అన్నయ్య పాత్ర చేశాడు. ఆ చిత్రంలో శ్రీకాంత్ ది నెగిటివ్ రోల్... 
 

57
Roja Selvamani

శ్రీకాంత్ హీరోగా ఎదిగాక రోజాకు జంటగా నటించారు. వీరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ క్షేమంగా వెళ్లి లాభంగా రండి. శ్రీకాంత్ కి భార్యగా రోజా నటించింది. అదే ఏడాది తిరుమల తిరుపతి వెంకటేశా చిత్రంలో జతకట్టారు. ఇది కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. 

 

67
Roja Selvamani

ఆ విధంగా అన్నయ్య పాత్ర చేసిన శ్రీకాంత్ తో రోజా రొమాన్స్ చేయాల్సి వచ్చింది. శ్రీకాంత్ ని రోజా సెట్స్ లో అన్నయ్య అని పిలిచేదట. చివరికి రొమాంటిక్ సీన్స్ లో కూడా అన్నయ్య అంటుంటే శ్రీకాంత్ కి చాలా ఇబ్బంది పడేవాడట. 

77

ఎహే... నన్ను అన్నయ్య అనకు రొమాంటిక్ మూడ్ రావడం లేదని... ఒకసారి రోజా మీద శ్రీకాంత్ కోప్పడ్డాడట. ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయం వెల్లడించాడు. 
 

click me!

Recommended Stories