బిగ్ బాస్ 5ని కాపాడేందుకు వాళ్ళిద్దరితో చర్చలు ? జోష్ తగ్గడానికి కారణాలు ఇవే

First Published Sep 11, 2021, 10:14 AM IST

బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబర్ 5న గ్రాండ్ గా లాంచ్ అయింది. బిగ్ బాస్ 5లో 5 రెట్ల వినోదం అంటూ కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కా

బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబర్ 5న గ్రాండ్ గా లాంచ్ అయింది. బిగ్ బాస్ 5లో 5 రెట్ల వినోదం అంటూ కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ నాగ్ ఇమేజ్ బిగ్ బాస్ షోకి వీకెండ్ లో మాత్రమే పనికి వస్తుంది. మిగిలిన రోజుల్లో ఇంటి సభ్యులే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. లేకుంటే టీఆర్పీ డల్ అయిపోవడం ఖాయం. 

ప్రస్తుతం  బిగ్ బాస్ 5కి ఆశించిన స్థాయిలో జోష్ కనిపించడం లేదు. 19 మంది సభ్యులని హౌస్ లోకి పంపించారు. కంటెస్టెంట్స్ సంఖ్య పెరిగినంత మాత్రాన వినోదం పెరగదు. ఇదే బిగ్ బాస్ 5 లో జరుగుతోంది. హౌస్ లోపల ఉండే కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి. అది జరగాలంటే తెలిసిన, పాపులర్ అయిన సెలెబ్రిటీలని హౌస్ లోకి పంపాలి. 

కానీ హౌస్ లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళ గురించి సినీ అభిమానులకు కానీ, బుల్లి తెర అభిమానులకు కానీ పెద్దగా తెలియదు. సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు సెలెబ్రిటీలు అంటూ హౌస్ లోకి తోసేయడం, వీళ్ళ వల్ల షో సూపర్ సక్సెస్ అవుతుందని భావించడం భ్రమే. 

బిగ్ బాస్ లో అసలు తెలిసిన కంటెస్టెంట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు ఇతర పాపులర్ షోలపై దృష్టి పెడుతున్నారు. దీనితో బిగ్ బాస్ షోకి ఆడియన్స్ ట్రాఫిక్ తగ్గిపోతున్నట్లు వినికిడి. 

దీనితో బిగ్ బాస్ 5 టీం డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒకరు లేదా ఇద్దరు క్రేజీ సెలెబ్రిటీలని హౌస్ లోకి పంపాలని డిసైడ్ అయినట్లు టాక్. బిగ్ బాస్ టీం అలెర్ట్ కావడానికి మరో కారణం కూడా ఉంది. మరో వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. ఆ ఎఫెక్ట్ తప్పకుండా బిగ్ బాస్ పై ఉంటుంది. మరోవైపు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో నడుస్తోంది. 

వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకున్న వర్ష లేదా వర్షిణి సౌందర్యరాజన్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరిని వైల్డ్ కార్డు గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా బిగ్ బాస్ టీం వీలైనంత త్వరగా వైల్డ్ కార్డు ప్లాన్ చేయాలి.. లేకుంటే టీఆర్పీ కష్టమే అనే వాదన వినిపిస్తోంది. 

click me!