సంక్రాంతికి కుర్ర హీరోయిన్లదే హవా.. వెండితెరపై పది మంది ముద్దుగుమ్మలు.. ఎవరెవరంటే?

Published : Jan 06, 2024, 03:07 PM ISTUpdated : Jan 06, 2024, 03:09 PM IST

సంక్రాంతి 2024కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలతో యంగ్ హీరోయిన్లు సందడి చేయబోతున్నారు. ఈసారి సినిమాలన్నీ మొత్తం కుర్ర భామలతోనే అలరించబోతున్నాయి. ఇంతకీ ఏఏ హీరోయిన్ ఏ మూవీలో నటించబోతోందో చూద్దాం..  

PREV
15
సంక్రాంతికి కుర్ర హీరోయిన్లదే  హవా.. వెండితెరపై  పది మంది ముద్దుగుమ్మలు.. ఎవరెవరంటే?

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela),  క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  ఈ సంక్రాంతికి తొలుత సందడి చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రంతో ఈ ముద్దుగుమ్మలిద్దరూ వెండితెరపై అదరగొట్టబోతున్నారు. 

25

గుంటూరుకారం చిత్రంలో శ్రీలీలా మహేశ్ బాబు Mahesh Babu సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మీనాక్షి చౌదరి ఎలా కనిపించబోతోందనేది ఆషక్తికరంగా మారింది. మొత్తానికి మూవీ అప్డేట్స్ కూడా అదిరిపోయాయి. ఈ చిత్రం జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

35

ఇక యంగ్ హీరో తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న ‘హనుమాన్’ మూవీ నుంచి యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ Amritha Aiyer తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఆయా చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీతో రాబోతోంది. అలాగే ఇందులో వరలక్ష్మి శరత్ కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. 

45

అలాగే వెంకటేశ్ సైంధవ్ Saindhav Movie తో ఏకంగా ముగ్గురు యంగ్ హీరోయిన్లు ప్రేక్షకులను అలరించబోతున్నారు. తమ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఈ యాక్షన్ ఫిల్మ్ లో శ్రద్ధా శ్రీనాథ్ Shraddha Srinath, రుహానీ శర్మ (Ruhani Sharma), ఆండ్రియా Andrea లు అలరించబోతున్నారు. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

55

అలాగే అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ' (Naa Saami Ranga) సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. నాగార్జున సరసన కన్నడ భామ ఆషిక రంగనాథ్, అల్లరి నరేష్ సరసన మిర్నా మీనన్, రాజ్ తరుణ్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా వచ్చాయి. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానుంది. 

click me!

Recommended Stories