తమన్నా, రకుల్‌, శృతి, అదితి, సంయుక్త.. అత్తారింటికి వెళ్లేందుకు రెడీ అంటోన్న భామలు.. ఈ ఏడాదే పెళ్లి?

Published : Jan 06, 2024, 01:31 PM ISTUpdated : Jan 06, 2024, 04:49 PM IST

టాలీవుడ్‌ హీరోయిన్లు ఈ ఏడాది పెళ్లి పీఠలెక్కబోతున్నారు.  కెరీర్‌తో సంబంధం లేకుండా మ్యారేజ్‌కి రెడీ అవుతున్నారట. ఈ ఏడాది నాలుగైదుగురు భామలు కోడలిగా అత్తారింటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. 

PREV
17
తమన్నా, రకుల్‌, శృతి, అదితి, సంయుక్త.. అత్తారింటికి వెళ్లేందుకు రెడీ  అంటోన్న భామలు.. ఈ ఏడాదే పెళ్లి?

హీరోయిన్లు రూట్‌ మార్చారు. ఒకప్పుడు సినిమాలకు గుడ్‌ బాయ్‌ చెప్పే దశలో పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు కెరీర్‌, పెళ్లికి సంబంధం లేదంటున్నారు. పెళ్లీళ్లు చేసుకుని కూడా హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. సమంత నుంచి నయనతార, హన్సిక, నార్త్ లో కత్రినా కైఫ్‌, అలియాభట్‌, కియారా అద్వానీ వంటి హీరోయిన్లు ఈ విషయంలో ముందున్నారు. రాబోయే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

27

దీంతో ఇప్పుడు మరికొంత మంది కథానాయికలు కూడా పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్న అందాల భామలు మూడుముళ్లు వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సినిమా కెరీర్‌తో సంబంధం లేకుండా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. వారిలో స్టార్‌ హీరోయిన్లు ఉండటం విశేషం. వారిలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తమన్నా, శృతి హాసన్‌, సంయుక్త మీనన్‌ వంటి కథానాయికలున్నారు. వీరంతా ఈ ఏడాది ఓ ఇంటికి కోడలిగా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. 

37

రకుల్ ప్రీత్‌ సింగ్‌ త్వరలోనే తన మెడలో మూడుముళ్లు వేసుకునేందుకు రెడీ అవుతుందట. ఆమె చాలా కాలంగా బాలీవుడ్‌ నటుడు,నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. బహిరంగంగానే తమ ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎక్కడికెళ్లినా చెట్టాపట్టాలేసుకుని వెళ్తున్నారు. అందరికి హింట్‌ ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారనే వార్త వినిపిస్తుంది. ఇప్పటికే డేట్‌, వేదిక కూడా ఫైనల్‌ చేసుకున్నారట. ఈ ఫిబ్రవరిలో గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ప్రస్తుతం కొత్తగా మరేసినిమాలను కమిట్‌ కాలేదు రకుల్. దీంతో పెళ్లికి రెడీ అవుతుందని అంటున్నారు. 
 

47

తమన్నా కూడా ఈ విషయంలో ముందే ఉంటుందట. ఆమె నటుడు విజయ్‌ వర్మతో గత రెండు మూడేళ్లుగా ప్రేమలో ఉంది. ఇటీవల ఈ ఇద్దరు కలిసి `లస్ట్‌ స్టోరీస్‌ 2` వెబ్‌ సిరీస్‌లోనూ కలిసి నటించారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా తమ ప్రేమ వ్యవహరాన్ని నడిపించారు. కానీ ఇప్పుడు ఓపెన్‌ చేశారు. ప్రైవేట్‌ ఈవెంట్లలో కలిసే కనిపిస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నారట. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఇంట్లో పెళ్లికి సంబందించిన ఒత్తిడి పెరుగుతుందని తెలుస్తుంది. దీంతో ఇక మ్యారేజ్‌ చేసుకోవాలని భావిస్తున్నారట. బహుశా ఈ సమ్మర్‌గానే, ద్వితీయార్థంలోగానీ మ్యారేజ్‌ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికితోడు తమన్నా కొత్తగా ఇటీవల మరే సినిమాకి సైన్‌ చేయలేదు. ఇది పెళ్లికే సాంకేతం అంటున్నారు.

57
aditi rao hydari siddharth

సంయుక్త మీనన్‌ కూడా పెళ్లి చేసుకోబోతుందనే వార్త నెట్టింట గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతుంది. ఆమె ఇటీవల `డెవిల్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇది బాక్సాఫీసు వద్ద డీలా పడింది. అయితే సంయుక్త కొత్తగా ఇప్పటి వరకు ఏ సినిమాని ప్రకటించలేదు. దీంతో ఆమె గ్యాప్‌ తీసుకోవడానికే కొత్త సినిమాలు ఒప్పుకోలేదని, ఆ గ్యాప్‌ పెళ్లికోసమే అంటున్నారు. త్వరలోనే లేదంటే ఈ ఏడాదిలో ఆమె పెళ్లిజరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి లవర్‌ ఉన్నాడా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అసలు పెళ్లి చేసుకుంటుందా? అనేది పెద్ద సస్పెన్స్. 
 

67

శృతి హాసన్‌ కూడా పెళ్లి వార్తల్లో నిలుస్తుంది. ఆమె డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో ఉండే. కరోనా సమయంలో ప్రియుడిని కనుక్కోంది శృతి. అప్పట్నుంచి కలిసే ఉంటుంది. సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల సీక్రెట్‌గా శృతి పెళ్లిచేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల `సలార్‌`తో సక్సెస్‌ అందుకున్న శృతి ప్రస్తుతం అడవి శేషుతో `డెకాయిట్‌` చిత్రంలో నటిస్తుంది. 

77

అలాగే అదితి రావు హైదరీ, సిద్ధార్థ్‌ ల పెళ్లి వార్త కూడా తరచూ వైరల్‌అవుతుంది. ఈ ఇద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇప్పటి వరకు తమ లవ్‌ స్టోరీపై క్లారిటీ ఇవ్వలేదు. పరోక్షంగా రియాక్ట్ అవుతున్నారు. తమ మధ్య ఏం లేదనే చెబుతున్నా కలిసే వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. విదేశీ వీధుల్లో రచ్చ చేస్తున్నారు. అంతేకాదు తమ ప్రేమని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నారట. ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కోడలిగా అత్తారింటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గతేడాది నాలుగు ఐదుగురు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా కథానాయికలుపెళ్లి బాట పట్టబోతున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. `మహాసముద్రం` సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడిన విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories