Allu Arjun, Keshava, Pushpa,
పుష్ప(Pushpa) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అనేది తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) క్యారెక్టర్ ఓ రేంజిలో వైరల్ అయ్యింది. ఈ సినిమా ఎంత క్లిక్ అయిందో పుష్ప పక్కనే ఉండే కేశవ పాత్ర కూడా అంతే బాగా క్లిక్ అయింది. చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఆ పాత్రలో నటించి నవ్వించి జగదీశ్ ప్రేక్షకులని మెప్పించాడు.
అంతకు ముందు పలాసా సినిమాలో చేసినప్పటికీ ‘పుష్ప’ సినిమా అతన్ని దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసింది. ఆ సినిమా తర్వాత ఇతనికి ఆఫర్లు పెరిగాయి. ఆ తర్వాత ‘సత్తిగాని రెండెకరాలు’ అనే వెబ్ సీరిస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు పుష్ప 2లోనూ ఫుల్ లెంగ్త్ పాత్ర చేస్తున్నారు. పర్శనల్ లైఫ్ లో వివాదాలు ఉన్నా, ఆర్టిస్ట్ గా సెట్ లో అదరకొడతారని అతనితో పనిచేసినవాళ్లు చెప్తారు. ఇక ఇదే విషయాన్ని కొంచెం అటూ ఇటూ లో అల్లు అర్జున్ చెప్పటం జరిగింది.
Allu Arjun, Keshava, Pushpa,
అల్లు అర్జున్ మాట్లాడుతూ ..నేనొక రోజు కేశవతో కూర్చుని అడుగుతున్నాను. నాకు తెలిసి ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఎవరికీ రాదు. ఒక కొత్త ఆర్టిస్ట్ కు ఫుల్ వాయిస్ ఓవర్, పార్ట్ లోనూ వెరీ బిగ్ క్యారక్టర్, కథ విన్నప్పుడే అనుకున్నాను. ఇంత పెద్ద క్యారక్టర్ ఎవరు వేస్తారు, వారు చాలా అదృష్టవంతులు అని. అలాంటి అదృష్టం ఇతనికి వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అతనికి ఆ కాలిబర్ కూడా ఉంది.
మీ ఇంట్లో చాలా హ్యాపీనా అని అడిగా. అతను వెంటనే సార్...మా ఇంట్లో వాళ్లకు నేను నటించటం ఇష్టం లేదు. వాళ్లెవరూ ఎంకరేజ్ చేయరు,నా పెళ్లికి కూడా ఇబ్బంది అవుతోంది అని చెప్పాడు. వర్రీ కావద్దు సినిమా రిలీజ్ అయ్యాక యావత్ భారతదేశం నిన్ను చూస్తుంది. నువ్వేం వర్రీ కావద్దు. అని చెప్పా. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చి కలిసి చెప్పాడు. సార్. నా లైఫ్ మారిపోయింది అని. నిజంగా నీ లైఫ్ మారినందుకు చాలా హ్యాపీగా ఉంది అని అల్లు అర్జున్ అన్నారు.
Allu Arjun, Keshava, Pushpa,
ఇక బన్నీ పక్కన కేశవ పాత్రలో చేసిన అతనిపేరు జగదీష్ ప్రతాప్ బండారి. చిన్న క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న జగదీష్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో సఫలమయ్యాడనే చెప్పాలి. పుష్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాలో హీరో పక్కన నటించే పాత్రల కోసం డైరెక్టర్ కొత్త నటులను తీసుకుని రిస్క్ తీసుకోరు.
అందుకు అలాంటి పాత్రలకోసం దర్శకులు ఇండస్ట్రీలో పేరున్న నటులను ఎంపిక చేసుకుంటారు. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం పేరు కంటే ప్రతిభ ఉన్నవాళ్లకు తన సినిమాలలో అవకాశాలను ఇవ్వటమే కలిసొచ్చింది.
Allu Arjun, Keshava, Pushpa,
కేశవ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్ బండారి కెరీర్ చూస్తే.. అతను పలాస 1978, మల్లేశం సినిమాలలో నటించాడు. అది కూడా చిన్న పాత్ర మాత్రమే. అయినా అతను చేసిన ప్రాత పరిధిని కాకుండా తన నటన గుర్తించాడు సుకుమార్.
సీమ యాసలో బాగా మాట్లాడే ఈ నటుడికి అదే యాసలో మాట్లాడే పాత్రను సుకుమార్ ఇవ్వడంతో పాత్ర న్యాయం చేశాడని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే పుష్ప సినిమాకు నెరేషన్ ఇచ్చింది కూడా ప్రతాప్ బండారి కావడం గమనార్హం. పుష్ప సక్సెస్ తో ప్రతాప్ బండారి పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
Rajamouli
అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తీసిన 'పుష్ప' మూవీ 2021 డిసెంబరులో రిలీజైంది. ఎలాంటి అంచనాల్లేకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజై, సెన్సేషన్ సృష్టించింది. దీంతో సీక్వెల్‌పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో దర్శకుడు సుకుమార్.. ప్రతి విషయాన్ని చాలా కేర్ తీసుకోవడం మొదలుపెట్టారు.
అలా దాదాపు మూడేళ్లు గడిచిపోయింది. ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబరు 6కి ప్లాన్ మార్చారు. ఇప్పుడు ఒక్కరోజు ముందుకి రిలీజ్ డేట్ జరిపినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
టాలీవుడ్‌లో మోస్ట్ అవైటడ్ మూవీగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’. సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవడంతో టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో కొత్త రికార్డు సాధించడం చూసి సినీ పండితులు కూడా షాక్‌కు గురి అయ్యారు. కరోనా తరువాత ఈ రేంజ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే పండగ చేసుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఇక టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ లో స్టార్ డమ్ ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. ఈరెండు భాషలే కాకుండా.. బాలీవుడ్ లో కూడా స్టార్ డమ్ ను సంపాధించాడు అల్లు అర్జున్. అంతే కాదు. పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను కూడా ఖాతాలో వేసుకున్నాడు.