2022లో మోస్ట్ పాపులర్ గా నిలిచిన చిత్రాలివే.. ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్న సినిమా ఏదంటే?

Published : Jul 14, 2022, 03:16 PM IST

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బాస్టర్ ఇండియన్ మూవీస్ ఎంతగానో అలరించాయి. ప్రముఖ ఐఎండీబీ సంస్థ 2022లో మోస్ట్ పాపులర్ గా నిలిచిన సినిమాల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది.

PREV
16
2022లో మోస్ట్ పాపులర్ గా నిలిచిన చిత్రాలివే.. ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్న సినిమా ఏదంటే?

సౌత్ సినిమాలకు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 2022లో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో లేట్ గా వచ్చినా.. లేటెస్ట్ గా వచ్చిన తమిళ చిత్రం ‘విక్రమ్’ (Vikram). ఈ మూవీకి ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ 2022 మోస్ట్ పాపులర్ సినిమాల్లో తొలి సినిమా గుర్తించింది. ఈ మూవీకి ఏకంగా 8.8 రేటింగ్ ఇవ్వడం విశేషం.
 

26

రెండో స్థానంలో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2) నిలిచింది. ఈ చిత్రానికి 8.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. వరల్డ్ వైడ్ హయ్యేస్ట్ గ్రాసింగ్ వసూళ్లు చేసిన తొలి కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్’ రికార్డు క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ క్రిష్ నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 

36

ఇక ఈ జాబితాలో మూడో స్థానాన్ని బాలీవుడ్ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ దక్కించుకుంది. కశ్మీర్ పండిట్ల మారణకాండపై చిత్రీకరించిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. ఏకంగా పీఎం నరేంద్రమోడీనే చిత్ర యూనిట్ ను అభినందించడం విశేషం. ఈ మూవీకి ఐఎండీబీ సంస్థ 8.3 రేటింగ్ ను ఇచ్చింది.
 

46

2022 మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాల్లో మలయాళ చిత్రం ‘హృదయం’ కూడా చోటుదక్కించుకుంది. ఈ రొమాంటిక్ ఫిల్మ్  ఆడియెన్స్ నుంచి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఐఎండీబీ మూవీకి 8.1 రేటింగ్ ఇస్తూ నాల్గో స్థానాన్ని కేటాయించింది.  ఇప్పటికీ ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. 

56

టాలీవుడ్ నుంచి వచ్చిన మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (RRR)కు 8 రేటింగ్ దక్కింది. తెలుగు వెర్షన్ కు ఇంతటి రేటింగ్ దక్కడం విశేషం. వరల్డ్ వైడ్ హ్యయేస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ లో నాల్గో స్థానాన్ని దక్కించుకుంది. 2022 మోస్ట్ పాపులర్ చిత్రాల్లో ఐదో సినిమాగా నిలిచింది.

66

ఇక ఆరు, ఏడు స్థానాల్లో బాలీవుడ్ చిత్రాలకు ఐఎండీబీ సంస్థ రేటింగ్ ఇచ్చింది. ‘ఏ థర్స్ డే’కు 7.8, అమితాబ్ నటించిన ‘ఝండ్’ చిత్రానికి 7.4 రేటింగ్ ఇచ్చింది. 7.2 రేటింగ్ తో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో రన్ వే 34, సామ్రాట్ పృథ్వీరాజ్ నిలిచాయి. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ టాప్ టెన్ రేటింగ్ 7ను దక్కించుకుంది.   

click me!

Recommended Stories