Sadha: నితిన్ కి సదా ఝలక్ ఇచ్చిందా.. ? చివరి నిమిషంలో ప్లాన్ చేంజ్!

Published : Jul 14, 2022, 03:06 PM IST

యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇటీవల ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు.

PREV
16
Sadha: నితిన్ కి సదా ఝలక్ ఇచ్చిందా.. ? చివరి నిమిషంలో ప్లాన్ చేంజ్!

యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇటీవల ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. 'రారా రెడ్డి' అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ఇన్స్టంట్ గా హిట్ గా మారిపోయింది. 

 

26

తెలుగు బ్యూటీ అంజలి ఈ ఐటెం సాంగ్ చేసింది. నితిన్ డ్యాన్స్, అంజలి అందాలు, క్యాచీగా ఉన్న లిరిక్స్ తో ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ సాంగ్ చివర్లో 'జయం' చిత్రంలోని 'రాను రానంటూనే చిన్నదో' సాంగ్ ని పెట్టారు. ఇది ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చేసింది. వాస్తవానికి నితిన్ ఐటెం సాంగ్ కి బదులుగా 'రాను రానంటూనే చిన్నదో' పాటని కంప్లీట్ గా రీమిక్స్ చేయాలనుకున్నాడట. 

36

దీని కోసం నితిన్.. హీరోయిన్ సదాని సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ సదా నుంచి నితిన్ కి చేదు అనుభవం తప్పలేదు. ఈ సాంగ్ లో చేసేందుకు సదా అంగీకరించలేదట. నితిన్, సదా జయం చిత్రంలో కలసి నటించారు. ఆ చిత్రంలోని ఈ సాంగ్ అప్పటి యువతని ఉర్రూతలూగించింది. ఆ సాంగ్ ని కనుక సదాతో రీమిక్స్ చేస్తే రెస్పాన్స్ అదిరిపోతుంది అనేది నితిన్ మొదటి ప్లాన్. కానీ సదా ఒప్పుకోకపోవడంతో ప్లాన్ చేంజ్ చేశాడు. వెంటనే ఐటెం సాంగ్ రాయించి చివర్లో 'రాను రానంటూనే చిన్నదో' పాట లిరిక్స్ పెట్టారు. 

46

ఒక రకంగా సదా కూడా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది అనే చెప్పాలి. మునుపటిలా సదాకి ప్రస్తుతం ఆఫర్స్ లేవు. మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసి ఉంటే ఎంతలా వైరల్ అయి ఉండేదో చెప్పనవసరం లేదు. సదా కెరీర్ కి ఇది బూస్టర్ లా పనిచేసి ఉండేది. కానీ సదా ఈ ఆఫర్ మిస్ చేసుకుంది. 

56

కానీ ఇప్పుడు రారా రెడ్డి సాంగ్ కి కూడా రెస్పాన్స్ అదిరి పోతుండడంతో నితిన్ అండ్ టీం సూపర్ హ్యాపీగా ఉన్నారు. అంజలి అందాలకు యువత ఫిదా అవుతున్నారు. మోకాలు గాయం ఉన్నప్పటికీ అంజలి అద్భుతంగా డాన్స్ చేసింది అంటూ నితిన్ ప్రశంసించాడు. 

66

చాలా కాలం తర్వాత నితిన్ చేస్తున్న మాస్ మూవీ ఇది. మాచర్ల నియోజకవర్గం చిత్రాన్ని ఆగష్టు 12న రిలీజ్ చేస్తున్నారు. కృతి శెట్టి, క్యాథెరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్రఖని విలన్ రోల్ లో కనిపిస్తున్నారు. ఎడిటర్ శేఖర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడు. 

click me!

Recommended Stories