చిత్ర పరిశ్రమలోకి ఓటీటీల ఎంట్రీ తర్వాత ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్లు మలుపు తిరుగుతున్నాయి. దాంతో సినిమాల ఆఫర్లు పెరుగుతున్నాయి. దీంతో ముద్దుగుమ్మలు థియేట్రికల్ ప్రాజెక్ట్స్ కంటే.. డిజిటల్ ప్రాజెక్ట్స్ లో తమ రెమ్యునరేషన్లను భారీగా పెంచేస్తున్నారు. ఈ వరసలో టాప్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) ఒక్కో ఓటీటీ ప్రాజెక్ట్ కు రూ.10 నుంచి రూ.12 కోట్లు తీసుకుంటోంది.