స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నార్త్ చెందిన నటి అయినప్పటికీ దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన నటన, అందంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.