సోషల్ మీడియాలో రంభ కూతురి క్రేజ్ చూశారా.. అందంలో తల్లిని మించిపోయిందిగా

First Published | Feb 14, 2024, 4:22 PM IST

హీరోయిన్ రంభ 90వ దశకంలో ఒక ఊపు ఊపింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో నటించి మెప్పించింది.

హీరోయిన్ రంభ 90వ దశకంలో ఒక ఊపు ఊపింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో నటించి మెప్పించింది. గ్లామర్, నటన, డ్యాన్స్ ఇలా ప్రతి విషయంలో రంభకి తిరుగులేదు. ఎవరినైన అందంతో పోల్చాల్సి వస్తే రంభలా ఉందనే వారు. అంతలా రంభ క్రేజ్ సొంతం చేసుకుంది. 

రంభ ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 100కి పైగా చిత్రాల్లో నటించింది. రంభ కెరీర్ లో హిట్లర్, బొంబాయి ప్రియుడు, బావగారు బావున్నారా లాంటి మెమొరబుల్ హిట్ చిత్రాలు ఉన్నాయి. 


ప్రస్తుతం రంభ వెండితెరకి దూరంగా ఉంటోంది. ఇంతలో రంభ కుమార్తె సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. స్టార్ హీరోలు హీరోయిన్లు తమ వారసులని ఇండస్ట్రీకి తీసుకువస్తుంటారు. రంభ కూడా తన కుమార్తెని హీరోయిన్ ని చేసే ఉద్దేశంలో ఉన్నట్లు ఉంది. రంభకి ముగ్గురు పిల్లలు సంతానం. ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు. 

పెద్ద కుమార్తె ఇంకా టీనేజ్ లోనే ఉంది. కానీ రంభ తరచుగా తన కుమార్తె ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా 'మై ఎంజల్' అంటూ రంభ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలోతెగ వైరల్ గా మారింది. 

దానికి కారణం రంభ కుమార్తె బ్యూటిఫుల్ లుక్స్ అనే చెప్పొచ్చు. రంభ కూతరు చాలా అందంగా ఉంది. దీనితో నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 

రంభ కూతురు హీరోయిన్ అయితే స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. రంభ కూతరు అచ్చం అమ్మలాగే ఉందని ప్రశంసిస్తున్నారు.  ప్రస్తుతం రంభ తన భర్త పిల్లలతో కెనడాలో నివాసం ఉంటోంది. 

Latest Videos

click me!