Kriti Sanon : ఆదిత్య రాయ్ కపూర్ తో కృతి సనన్ రిలేషన్.. ‘కాఫీ విత్ కరణ్’ షోలో షాకింగ్స్ కామెంట్స్.!

Published : Sep 01, 2022, 01:46 PM ISTUpdated : Sep 01, 2022, 02:26 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) తాజాగా ‘కాఫీ విత్ కరణ్ 7’ టాక్ షోలో టైగర్ ష్రాఫ్ తో మెరిసింది. ఈ సందర్భంగా ఆదిత్య రాయ్ కపూర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. 

PREV
16
Kriti Sanon : ఆదిత్య రాయ్ కపూర్ తో కృతి సనన్ రిలేషన్..  ‘కాఫీ విత్ కరణ్’ షోలో  షాకింగ్స్ కామెంట్స్.!

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న పాపులర్ టాక్ ‘కాఫీ విత్ కరణ్’ (Koffee with Karan 7). గతం నుంచే ఈషోను కరణ్ బోల్డ్ టాక్ తో విపరీతంగా పాపులర్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ల పర్సనల్ మరియు ప్రొఫెషనల్ విషయాలపై ప్రశ్నలు సంధిస్తూ వారితోనే షాకింగ్ ఆన్సర్స్ ను రాబడుతున్నారు. 
 

26

ఇటీవల ‘లైగర్’ జోడీ విజయ్ దేవరకొండ - అనన్య పాండే ఈ షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా షోకు ‘హీరోపంథి 2’   స్టార్స్ హాజరయ్యారు. 2014లో వచ్చిన ‘హీరోపంథి’కి సీక్వెల్ గా ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ లోనే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. 

36

ఇదిలా ఉంటే తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరైన ఈ జోడీకి  కరణ్ బోల్డ్ గా ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా కృతికి మరియు ఆదిత్య రాయ్ కపూర్‌ (Aditya Roy Kapur)కి మధ్య ఏదో మేటర్ నడుస్తుందంటూ రెచ్చగొట్టేలా ప్రశ్నించారు. దీనిపై కృతి వెంటనే స్పందించికపోయినా షో చివర్లో షాకింగ్ కామెంట్స్ చేసింది. 

46

అదేవిధంగా కరణ్ బర్త్ డే పార్టీలో కృతి మరియు ఆదిత్య ఒక కార్నర్‌లో కనిపించారని గుర్తు చేశాడు. ఈ సందర్భంగా కృతిని ‘కృతి మీరు కొంతకాలంగా ఒంటరిగా ఉన్నారు. మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఈ మేరకు పుకార్లు వచ్చాయి. మీరిద్దరూ పార్టీలో క్యానోడ్లింగ్ చేయడం చర్చగా మారింది’ అంటూ ప్రశ్నించారు. 

56

ఇందుకు కృతి ప్రతిస్పందిస్తూ.. ‘మేమిద్దరం కలిసి బాగానే ఉంటాం.  అది మీకూ తెలుసు, కానీ నేను ఒక మూలన ఉండలేను. ఆదిత్య రాయ్ తో ఉంటే సరదాగా ఉంటుంది’ అని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మున్ముందు ఆదిత్యా రామ్ మరియు కృతి కలిసి సంజయ్ లీలా బన్సాలీ తదుపరి చిత్రంలో కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది.  
 

66

ఇక  ఈ బ్యూటీ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అందులో భారీ చిత్రం ‘ఆదిపురుష్’లో హీరోయిన్ గా కృతి సనన్ అవకాశం దక్కించున్న విషయం తెలిసిందే. తొలిసారిగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన ఈ బ్యూటీ సౌత్ ఆడియెన్స్ ను మరోసారి అలరించనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories